By: Sai Prasad | Updated at : 09 May 2024 07:56 AM (IST)
సావరీన్ గోల్డ్ బాండ్స్
Sovereign Gold Bond 2024: బంగారం ధర రోజు రోజుకీ ఆకాశాన్నంటుతోంది. లాంగ్ టర్మ్‌లో భూముల తర్వాత బంగారానికి మించిన పెట్టుబడి మరొకటి లేదు. మరి బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. సాధారణంగా ఏం చేస్తారు..? నగలనో, బంగారు బిస్కెట్లనో డబ్బు పెట్టి కొంటారు. ఒక వేళ ఇంట్లో ఉంచుకుంటే ఆ బంగారాన్ని ఎవరు దొచుకెళ్తారో ననే భయంతో దాన్ని దాచేందుకు తిరిగి లాకర్లకు డిపాజిట్ల రూపంలో డబ్బు వెచ్చిస్తారు. పైగా నగలు కొంటే తరుగు, మజూరీ, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు దాదాపు 20 శాతం వరకు చెల్లిస్తారు. బంగారు బిస్కెట్లు కొన్నా జీఎస్టీ తప్పదు. అసలు ఈ ఇబ్బందులన్నీ లేకుండా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకున్న ప్రత్యామ్నాయ మార్గమే.. సావరీన్ గోల్డ్ బాండ్లు. భారతదేశంలో సావరీన్ గోల్డ్ బాండ్లకు మాంచి గిరాకీ పెరిగింది. దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
అసలేంటివి..?
సావరీన్ గోల్డ్ బాండ్లు అంటే ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న పసిడి బాండ్లు. అంటే.. దీంట్లో మీరు కొన్నబంగారం కేవలం పేపర్ మీదే ఉంటుంది తప్ప నేరుగా మీ చేతికి ఏమాత్రం రాదు. కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కేజీల వరకు ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ట్రస్టులైతే.. 20 కేజీల వరకు కొనుక్కోవచ్చు. వీటి బాండ్ పీరియడ్ 8 ఏళ్లు. అంటే ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని అలాగే కదపకుండా ఉంచాలన్నమాట. గడువు ముగిశాక అప్పటికీ బంగారం ధర ఎంత ఉందో దాన్ని బట్టీ మీ బాండ్‌లో ఉన్న బంగారానికి డబ్బు చెల్లిస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్సూ కట్టనక్కర్లేదు. బాండ్ తీసుకున్నాక ఐదేళ్ల తర్వాత కూడా.. అవసరం అనుకుంటే వీటి నుంచి బయటకు రావచ్చు. కాకపోతే.. ఎనిమిదేళ్లలోపు బయటకొస్తే.. అప్పటి ధర ప్రకారం డబ్బు వచ్చినా.. దానిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తారు.
ఎక్కడ తీసుకోవచ్చు..?
ఈ సావరీన్ గోల్డ్ బాండ్లను ఆర్బీఐ మంజూరు చేస్తుంది. మీ బాండ్‌లోని బంగారానికి గ్యారెంటీ ఇచ్చేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. ఎస్బీఐ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఈ బాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్సేంజిల ద్వారానూ వీటిని పొందొచ్చు. బంగారం విలువకు అణుగుణంగా ఈ బాండ్ల ధర పెరగటమే కాకుండా.. వీటి నుంచి వార్షిక వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం ఫిక్సుడుగా ఉండే ఈ వడ్డీని ఆరునెలలకోసారి దరఖాస్తు దారుడిచ్చిన ఖాతాలో వేస్తారు. ఉదాహరణకు.. ఈ బాండ్ల కోసం రూ. పది లక్షలు వెచ్చిస్తే.. 25,000 మేర వార్షిక వడ్డీ వస్తుందన్నమాట. దీన్ని ఆరు నెలలకు 12,500 చొప్పున ఏడాదిలో రెండు సార్లు ఖాతాల్లోకి వేస్తారు.
ఆన్లైన్లో కొనుగోలు ఇలా?
నెట్ బ్యాంకింగకు లాగిన్ అయ్యాక.. మెనూలో ఈ సర్వీసెస్/ ఇన్వెస్ట్మెంట్ అనే సెక్షన్లో 'సావరిన్ గోల్డ్ బాండ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. (స్కీమ్ అందుబాటులో ఉన్నప్పుడు ఈ విండో తెరుచుకుంటుంది). టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. సావరిన్ గోల్డ్ బాండ్లకు అవసరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్ (ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్)ను ఎంచుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫారాన్ని సమర్పించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత పర్చేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి. మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ వెబ్సైట్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కొనుగోలు చేయలేనివారు దగ్గర్లోని బ్యాంక్ శాఖ, ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన యూనిట్లను అందులో పొందుపరిచి చెక్, డీడీ రూపంలో పేమెంట్ పూర్తి చేయాలి: ఆధార్, పాన్: వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఎప్పుడు కొనాలి..?
ఈ సావరీన్ గోల్డ్ బాండ్లు ఎప్పుడు పడితే అప్పుడు కొనే వీల్లేదు. ఆర్బీఐ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే కొనే వీలుంది. 2015-16లో మూడు సార్లు, 2016-17లో నాలుగు సార్లు, 2017-18లో 14 సార్లు ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకూ నాలుగు సార్లు సావరీన్ గోల్డ్ బాండ్లు మంజూరు చేశారు. ఒక్కోసారి మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ బాండ్లు మంజూరు చేస్తారు. ఈ రోజుల్లోనే బాండ్లు కొనేందకు వీలుంటుంది.
సెకండ్స్ మార్కెట్‌లో దీని నుంచి అప్పటికప్పుడు డబ్బులు పొందాలనుకునే వారి నుంచి స్టాక్ మార్కెట్లో వీటిని కొనుక్కోవచ్చు. కొనేవాళ్లకి లాభమే అయినా అమ్మే వాళ్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డీమాట్ ఖాతా ఉంటే నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా సెకండ్స్ లో ఈ బాండ్లను ఎప్పుడైనా కొనుక్కోవచ్చు.
ఏంటి ప్రయోజనం..
2015లో ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు ఈ బాండ్లు తీసుకున్న వాళ్లు.. అప్పట్లో 24 క్యారెట్ల గ్రాము బంగారానికి రూ. 2,684 చెల్లించి బాండ్లను పొందారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,227. వాళ్ల బాండ్లు 8 ఏళ్ల తరువాత.. ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నాయి. అప్పట్లో దాదాపు రూ. 5 లక్షలకు బాండ్లు తీసుకున్నట్లైతే.. ప్రస్తుతం 13,46,500 వరకు. అంటే దాదాపు మూడు రెట్లై వాళ్ల డబ్బు తిరిగొస్తుంది. దీనిపై ఎలాంటి పన్నూ పడదు. మధ్యలో అమ్మేవాళ్లు మాత్రం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?