By: Arun Kumar Veera | Updated at : 23 Dec 2024 02:52 PM (IST)
సరెండర్ విలువను తీసేసిన తర్వాత చెల్లింపు ( Image Source : Other )
Disadvantages Of LIC Policy Surrendering: ఆకస్మిక పరిస్థితుల్లో, జీవిత బీమా తక్షణ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (పాలసీదారు) హఠాత్తుగా చనిపోతే, అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు జీవితా బీమా పాలసీ ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అయితే, జీవిత బీమా పాలసీ అనేది దీర్ఘకాలిక ప్రణాళిక. పాలసీదారుడు కొన్ని సందర్భాల్లో ప్రీమియంను చెల్లించలేకపోవచ్చు. ఆర్థిక సవాళ్ల కారణంగా వల్ల ఆ పాలసీని తాను కొనసాగించలేనని నిర్ణయించుకోవచ్చు. లేదా, అత్యవసరంగా డబ్బు అవసరం పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, చాలా మంది పాలసీహోల్డర్లు తమ జీవిత బీమా పాలసీలను మెచ్యూరిటీకి ముందుగానే సరెండర్ చేస్తుంటారు.
పాలసీని సరెండర్ చేయడం వల్ల చాలా నష్టాలు
పాలసీని సరెండర్ చేయడం వల్ల పాలసీదారు బ్యాంక్ ఖాతాలోకి వెంటనే డబ్బు వస్తుంది. అక్కడితో ఆ పాలసీకి - అతనికి మధ్య సంబంధం తెగిపోతుంది. అక్కడి నుంచి అతను ప్రీమియం కట్టనవసరం లేదు. కానీ, ఇలాంటి కేస్‌లో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పాలసీని సరెండర్ చేసినప్పుడు, పాలసీదారు కట్టిన చాలా డబ్బును నష్టపోవాల్సి వస్తుంది. ప్రీమియం రూపంలో అతను చెల్లించిన మొత్తం డబ్బును బీమా కంపెనీ తిరిగి ఇవ్వదు. మెచ్యూరిటీ సమయంలో వచ్చే ఇతర ప్రయోజనాలకు కూడా కోల్పోవాల్సి వస్తుంది.
సరెండర్ విలువను తీసేసిన తర్వాత చెల్లింపు
పాలసీని సరెండర్ చేయడం అంటే, మీ కుటుంబానికి ఉన్న ఆర్థిక భద్రత కవచాన్ని స్వయంగా మీరే తీసేయడం. పాలసీని సరెండర్ చేసిన తర్వాత, డిపాజిట్ + పాలసీ మెచ్యూరిటీపై బోనస్ వంటి ప్రయోజనాలను మీరు/ మీ కుటుంబం కోల్పోతుంది. బీమా సంస్థ, సరెండర్ వాల్యూని తీసేసి మిగిలిన డబ్బును తిరిగి ఇస్తుంది, ఇది చాలా తక్కువగా ఉంటుంది. పాలసీని సరెండర్ చేసిన తర్వాత ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి అందాల్సిన డెత్ బెనిఫిట్ రాదు. అంతేకాదు, జీవిత బీమా పాలసీని కొనసాగించినంత కాలం ఆదాయ పన్ను మినహాయింపును కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు పాలసీని సరెండర్ చేస్తే ఈ ప్రయోజనం కూడా పోతుంది. ఏ విధంగా చూసినా, జీవిత బీమా పాలసీని సరెండర్ చేయడం వల్ల నష్టమేగానీ లాభం కనిపించదు. కాబట్టి, జీవిత పాలసీని సరెండర్ చేయాలనే నిర్ణయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
సరెండర్ విలువ ఎంత ఉంటుంది?
సాధారణంగా, సరెండర్ విలువ ఇప్పటివరకు చెల్లించిన మొత్తం ప్రీమియలో 30 శాతం ఉంటుంది. పాలసీని కొనసాగించిన కాలాన్ని, బీమా కంపెనీ నియమాలను బట్టి సరెండర్ విలువ మారవచ్చు. పదేళ్ల దాటిని బీమా పాలసీలకు సరెండర్ వాల్యూ 'జీరో'.
పాలసీ సరెండర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు
జీవిత బీమా పాలసీని సరెండర్ చేయాల్సిన అవసరం లేకుండా, ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. బీమా కంపెనీని సరెండర్ చేయడానికి బదులుగా పాలసీదారు అదే సంస్థ నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అందిస్తోంది. పాలసీహోల్డర్ దగ్గర డబ్బులు ఉంటే రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు లేదా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ లోన్ చెల్లించకపోతే... ఆ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, బీమా కంపెనీలు రుణాన్ని + దానిపై వడ్డీని మినహాయించుకుని మిగిలిన డబ్బును పాలసీహోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తాయి. అంటే, ఇలా చేస్తే ఆర్థిక నష్టం తగ్గడంతోపాటు పాలసీ మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రయోజనాలు కూడా మిస్ కావు.
మరో ఆసక్తికర కథనం: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం