By: Arun Kumar Veera | Updated at : 23 Dec 2024 01:10 PM (IST)
ఎంత తక్కువ వడ్డీ ఉంటే అంత తక్కువ ఆర్థిక భారం ( Image Source : Other )
Lowest Home Loan Interest Rates 2024: బ్యాంక్ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ, ఒక హోమ్ లోన్ దరఖాస్తుదారుడికి రుణాన్ని మంజూరు చేసేందుకు & లోన్‌పై వడ్డీ రేటును నిర్ణయించేందుకు.. దరఖాస్తుదారుడి వయస్సు, ఆదాయం, అతనిపై ఆధారపడిన వారి సంఖ్య, జీవిత భాగస్వామి ఆదాయం, వృత్తిపరమైన స్థిరత్వం, ఇతర బాధ్యతలు, పొదుపులు, క్రెడిట్ హిస్టరీ వంటి అన్ని విషయాలను చెక్ చేస్తాయి. కొనుగోలు చేసే ఇంటి విలువ ఆధారంగా ఎంత లోన్ ఇవ్వాలో నిర్ణయిస్తాయి.
గృహ రుణం తీసుకున్న తర్వాత.. అసలు + వడ్డీని సమానమైన నెలవారీ వాయిదాల్లో (EMI) బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి. పూర్తి మొత్తం తీసుకున్న తర్వాతి నెల నుంచి EMI చెల్లింపు స్టార్ అవుతుంది. హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంక్‌లో రుణం తీసుకుంటే, మీ డబ్బు చాలా సేవ్ అవుతుంది.
హోమ్ లోన్‌పై ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు? (రూ.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ గృహ రుణంపై)
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ---------- 8.50-9.85
బ్యాంక్ ఆఫ్ బరోడా ---------- 8.40-10.90
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ---------- 8.30-10.90
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ---------- 8.40-10.15
బ్యాంక్ ఆఫ్ ఇండియా ---------- 8.35-11.10
కెనరా బ్యాంక్ ---------- 8.40-11.15
UCO బ్యాంక్ ---------- 8.45-10.30
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ---------- 8.35-11.15
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ---------- 8.50-10.00
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ---------- 8.40-10.60
ఇండియన్ బ్యాంక్ ---------- 8.40-10.30
ప్రైవేట్ రంగ బ్యాంకులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ ---------- 8.75 నుంచి
ICICI బ్యాంక్ ---------- 8.75 నుంచి
యాక్సిస్ బ్యాంక్ ---------- 8.75-9.65
HSBC బ్యాంక్ ---------- 8.50 నుంచి
సౌత్ ఇండియన్ బ్యాంక్ ---------- 8.70-11.70
కరూర్ వైశ్యా బ్యాంక్ ---------- 9.00-11.05
కర్ణాటక బ్యాంక్ ---------- 8.75-10.87
ఫెడరల్ బ్యాంక్ ---------- 8.80 నుంచి
ధనలక్ష్మి బ్యాంక్ ---------- 9.35-10.50
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ---------- 8.60-9.95
బంధన్ బ్యాంక్ ---------- 9.16-13.33
RBL బ్యాంక్ ---------- 9.00 నుంచి
CSB బ్యాంక్ ---------- 10.49-12.34
HDFC బ్యాంక్ లిమిటెడ్ ---------- 8.75 నుంచి
సిటీ యూనియన్ బ్యాంక్ ---------- 8.75-10.50
గమనిక: పాలసీబజార్ వెబ్‌సైట్ ప్రకారం 11 డిసెంబర్ 2024 వరకు ఉన్న రేట్లు ఇవి.
గృహ రుణానికి అనువైన సిబిల్ స్కోర్ ఎంత? (Ideal CIBIL score for home loan)
సిబిల్ స్కోర్ పరిధి 300 నుంచి 900 మధ్య ఉంటుంది. గృహ రుణ ఆమోదానికి అవసరమైన క్రెడిట్ స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కొన్ని బ్యాంక్‌లు కనీసం 700 స్కోర్‌ను లెక్కలోకి తీసుకుంటాయి. ఈ స్కోర్ 800 దాటితే బ్యాంక్‌లు వెంటనే లోన్ జారీ చేయవచ్చు. 550 కంటే తక్కువ ఉంటే దానిని బ్యాడ్ సిబిల్ స్కోర్‌గా బ్యాంక్‌లు పరిగణిస్తాయి, అలాంటి వ్యక్తులు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తాయి.
డిఫాల్ట్ అయితే ఏం జరుగుతుంది?
హోమ్ లోన్ EMI లేదా ఏ లోన్ EMI అయినా క్రమం తప్పకుండా చెల్లించడం ఉత్తమం. కస్టమర్ 3 కంటే ఎక్కువ EMIలను కట్టలేకపోతే, "సెక్యూరిటైజేషన్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002" (SARFAESI Act) ప్రకారం, కోర్టుల జోక్యం లేకుండా నేరుగా డిఫాల్టర్‌పై చర్య తీసుకునే అధికారం బ్యాంక్‌లకు ఉంటుంది. EMI చెల్లించడంలో మీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటే, మీ పరిస్థితి గురించి మీ బ్యాంక్‌కు ముందే తెలియజేయడం తెలివైన పని. దీనివల్ల, EMI చెల్లింపు వ్యవధిని పొడిగించుకునే అవకాశం లభించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు