అన్వేషించండి

UPI Cash Deposit: యూపీఐ ద్వారా నగదు జమ, డెబిట్‌ కార్డ్‌తో పని లేదు

యూపీఐ ద్వారా డిపాజిట్‌ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే.. డబ్బులు పట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు, డెబిట్‌ కార్డ్‌తోనూ పని ఉండదు.

UPI Cash Deposit Facility: ఇప్పటివరకు, UPI ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేశాం. ఇకపై, ATM కేంద్రం నుంచే యూపీఐ ద్వారా బ్యాంక్‌ అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్‌ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. మన దేశంలో యూపీఐకి ఉన్న విస్తృత ఆదరణను దృష్టిలో పెట్టుకుని దాని పరిధిని విస్తరిస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das), శుక్రవారం, యూపీఐకి సంబంధించి ఈ ప్రకటన చేశారు. యూపీఐ సిస్టమ్ ద్వారా ఏటీఎం నుంచే అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చని వెల్లడించారు. ఈ సదుపాయంతో కస్టమర్ల సౌలభ్యం పెరుగుతుందని అన్నారు. యూపీఐ వ్యవస్థ ద్వారా ఏటీఎం నుంచి అకౌంట్‌లో డబ్బు చేసే ఫెసిలిటీ వస్తే, ఇకపై డబ్బు జమ కోసం బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలుచునే శ్రమ తప్పుతుంది, చాలా సమయం ఆదా అవుతుంది. 

బ్యాంక్‌కు వెళ్లకుండా, ఏటీఎం కేంద్రం నుంచే అకౌంట్‌లో డబ్బు జమ చేసే ఫెసిలిటీ ఇప్పుడు కూడా ఉంది. ఇందుకోసం, ఏటీఎం కేంద్రంలోని ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌'ను (CDM) ఖాతాదార్లు ఉపయోగిస్తున్నారు. ఈ పని చేయాలంటే కచ్చితంగా డబ్బు తీసుకుని వెళ్లాలి, డెబిట్‌ కార్డ్‌ కూడా ఉండాలి. యూపీఐ ద్వారా డిపాజిట్‌ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే.. డబ్బులు పట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు, డెబిట్‌ కార్డ్‌తోనూ పని ఉండదు.

కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
UPI ద్వారా నగదు డిపాజిట్ చేసే ఈ విధానం ప్రస్తుతం కొనసాగుతున్న విత్‌డ్రా ప్రక్రియను పోలి ఉంటుంది. ప్రస్తుతం, డెబిట్‌ కార్డ్‌ లేకుండానే నగదు తీసుకోవాలనుకుంటే, ATMలో 'UPI కార్డ్‌లెస్ క్యాష్‌ ఆప్షన్‌' ఎంచుకోవాలి. ఆ తర్వాత, తీసుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. స్కీన్‌ మీద కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేసి, UPI పిన్‌ను ఎంటర్‌ చేస్తే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు డిపాజిట్ చేసే విధానం కూడా ఇదే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

UPI ద్వారా నగదు డిపాజిట్‌కు అనుమతి
UPI ద్వారా నగదు డిపాజిట్లకు RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) అనుమతి ఇచ్చిందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌'ల వల్ల బ్యాంకు ఉద్యోగుల పని, ఒత్తిడి తగ్గిందని దాస్‌ వివరించారు. బ్యాంకుల వద్ద పొడవైన క్యూలైన్‌లు కూడా తగ్గాయన్నారు. అందువల్లే UPI సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 

థర్డ్‌ పార్టీ యాప్‌లకూ PPIల లింక్‌
థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రి-లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌ వంటి ‘ప్రి-పెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌'ను (PPIs) సైతం లింక్‌ చేసేందుకు అనుమతించాలని RBI నిర్ణయించింది. డిజిటల్‌ చెల్లింపుల్లో ఇది మరో పెద్ద అడుగు అవుతుంది, యూజర్ల పని మరింత ఈజీ అవుతుంది. ప్రస్తుతం, యూపీఐ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతాను అదే బ్యాంక్‌ ఇచ్చే UPI యాప్ లేదా మరో థర్డ్‌ పార్టీ యాప్‌తో లింక్‌ చేస్తున్నారు. అలాగే, PPIలను సంబంధిత యాప్‌లతో అనుసంధానించి యూపీఐ ద్వారా పేమెంట్స్‌ చేస్తున్నారు. ఇకపై మధ్యలోని లింక్‌ను కట్‌ చేసి, థర్డ్‌ పార్టీ యాప్‌లకు సైతం PPIలను జత చేసే సౌకర్యం తీసుకువస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇది అమల్లోకి వస్తే, చిన్న లావాదేవీలకు కూడా డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget