అన్వేషించండి

Richest Person: ప్రపంచ సంపన్నుడు బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ - టాప్‌-10లో 9 మంది వాళ్లే

స్ట్‌ ర్యాంక్‌లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ ఒక్కడే అమెరికాయేతర వ్యక్తి.

Richest Person In The World: గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ LVMH (లూయిస్‌ విట్టన్) ఛైర్మన్ & CEO 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' ‍‌(Bernard Arnault) ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఫస్ట్‌ ప్లేస్‌లోకి వచ్చారు. టెస్లా బాస్‌ 'ఎలాన్‌ మస్క్‌'ను దాటి అగ్రస్థానానికి చేరారు. ఎలాన్ మస్క్‌ సెకండ్‌ ప్లేస్‌కు దిగి వచ్చారు.

ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ (Forbes Real Time Billionaires List) ప్రకారం, ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తిపాస్తుల విలువ 207.8 బిలియన్ డాలర్లు. ఆ కుటుంబం సంపదన శుక్రవారం నాడు 23.6 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆర్నాల్ట్‌ మొదటి ర్యాంక్‌ దక్కింది. అదే సమయంలో, ఎలాన్ మస్క్ నికర విలువ (Elon Musk net worth) 204.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది, 18 బిలియన్‌ డాలర్లకు పైగా తగ్గింది.

ఆదివారం నాటికి, బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ సంపద 207.6 బిలియన్‌ డాలర్లకు చేరింది, స్వల్పంగా తగ్గింది. మస్క్ మామ ఆస్తి 204.7 బిలియన్‌ డాలర్లకు, కొద్దిగా పెరిగింది. అయినా, ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానంలోనే ఉన్నారు. 

జాబితాలో మొదటి 10 స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్‌ మస్క్‌తో పాటు.. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్, లారీ పేజ్‌, బిల్ గేట్స్, సెర్గీ బ్రిన్, స్టీవ్‌ బాల్మెర్‌ ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే... ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ ఒక్కడే అమెరికాయేతర వ్యక్తి. టాప్‌-10లోని మిగిలిన 9 మంది సంపన్నులు యునైటెడ్‌ స్టేట్స్‌కు (USA) చెందిన వాళ్లే.

ఫోర్బ్స్‌ ప్రకారం, ప్రపంచ కుబేరుల జాబితా (Top 10 Billionaires In The World‌‌): 

1. బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ ‍‌(Bernard Arnault and family) ------ $207.6 బిలియన్లు ------ ఫ్రాన్స్

2. ఎలాన్ మస్క్ (Elon Musk) ------ $204.7 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

3. జెఫ్ బెజోస్ (Jeff Bezos) ------ $181.3 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

4. లారీ ఎల్లిసన్ (Larry Ellison) ------ $142.2 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

5. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ------ $139.1 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

6. వారెన్ బఫెట్ (Warren Buffett) ------ $127.2 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

7. లారీ పేజ్‌ (Larry Page) ------ $127.1 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

8. బిల్ గేట్స్ (Bill Gates) ------ $122.9 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

9. సెర్గీ బ్రిన్ (Sergey Brin) ------ $121.7 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

10. స్టీవ్ బాల్మెర్ (Steve Ballmer) ------ $118,8 బిలియన్లు ------ యునైటెడ్‌ స్టేట్స్‌

అంబానీ @ 11, అదానీ @ 16

ఫోర్బ్స్ లిస్ట్‌ ప్రకారం, భారతీయుల్లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముకేష్ అంబానీ ఆస్తుల విలువ ‍‌(Mukesh Ambani net worth) 104.4 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో అంబానీది 11వ ర్యాంక్‌. టాప్-10లో లేకపోయినా, 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ముకేష్‌ కొనసాగుతున్నారు. ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగానూ ముకేష్‌ నిలిచారు.

అదానీ గ్రూప్ చైర్మన్, గౌతమ్ అదానీ (Gautam Adani net worth) 75.7 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో 16వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడు అదానీ.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ను (Bloomberg Billionaires Index) చూస్తే ఈ లెక్కలో కాస్త తేడాలు ఉంటాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఎలాన్‌ మస్క్ 199 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇండెక్స్‌లో రెండో స్థానం జెఫ్ బెజోస్‌ది, ఆయన సంపద విలువ 184 బిలియన్‌ డాలర్లు. బెల్నార్డ్‌ ఆర్నాల్ట్ 183 బిలియన్‌ డాలర్లతో థర్డ్‌ ర్యాంక్‌లో ఉన్నారు.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
Anchor Neha Chowdary: డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy felicitated Boy | షాద్ నగర్ సాహసబాలుడికి సీఎం రేవంత్ సన్మానం | ABP DesamLeopard Spotted near Shamshabad Airport | ఎయిర్ పోర్ట్ గోడ దూకిన చిరుతపులి | ABP DesamOld Couple Marriage Viral Video | మహబూబాబాద్ జిల్లాలో వైరల్ గా మారిన వృద్ధుల వివాహం | ABP DesamVishwak Sen on Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నరాల్లోకి ఎక్కుతుందన్న విశ్వక్ సేన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీ, హైదరాబాద్‌ లక్ష్యం 213
Anchor Neha Chowdary: డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
డ్యాన్స్‌ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Sleeping Tips for Babies : పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
CBSE Results: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
CBSE విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
Kriti Sanon Latest Photos : కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు.. డెనిమ్ షార్ట్స్​తో మతి పోగొడుతున్న సుందరి
కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు.. డెనిమ్ షార్ట్స్​తో మతి పోగొడుతున్న సుందరి
Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం- ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ
Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం- ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ
Embed widget