Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Voda, JK Cement, TCS, UltraTech
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 20 March 2024: గ్లోబల్‌గా సానుకూల సిగ్నల్స్ ఉండడంతో ఈ రోజు (బుధవారం) భారతీయ మార్కెట్లు పతనం నుంచి బయటపడొచ్చు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 47 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్ కలర్‌లో 21,945 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం, దాదాపుగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లన్నీ ఆకుపచ్చ రంగులో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ASX 200 0.17 శాతం పెరిగింది. వడ్డీ రేట్లను 4.35 శాతం వద్ద కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వరుసగా మూడో సమావేశంలోనూ నిర్ణయించింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 1.37 శాతం జంప్ చేయడంతో దక్షిణ కొరియా కోస్పి 1.12 శాతం పెరిగింది. జపాన్ నికాయ్ 0.66 శాతం బలపడింది. అయితే.. హాంగ్ కాంగ్‌లో హాంగ్ సెంగ్ సూచీ 0.51 శాతం క్షీణించగా, చైనా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తర్వాత చైనీస్ CSI 300 0.72 శాతం పడిపోయింది.
నిన్న ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమావేశం ప్రారంభం కావడంతో, U.S.లో మూడు ప్రధాన ఇండెక్స్‌లు పెరిగాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.83 శాతం పెరిగింది, ఫిబ్రవరి 22 తర్వాత బలమైన పనితీరును కనబరిచింది. S&P 500 కొత్త రికార్డును చేరుకుంది, 0.56 శాతం పెరిగి 5,178.51 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 0.39 శాతం లాభపడింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
అల్ట్రాటెక్: కేసోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్‌కు CCI అనుమతి వచ్చింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ ట్రేడ్‌కామ్, అదానీ గ్రీన్ టెక్నాలజీలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ట్రేడింగ్ సర్వీసెస్ LLP నుంచి ఈ వాటా కైవసం చేసుకుంది.
HDFC బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాకు చెందిన 14,01,72,180 ఈక్విటీ షేర్లను కోప్‌వూర్న్ BV, మాస్ ఇన్వెస్ట్‌మెంట్స్, డిఫాటి ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ BV, ఇన్ఫినిటీ పార్ట్‌నర్స్‌కు ఈ బ్యాంక్ మళ్లించింది.
వొడాఫోన్ ఐడియా: రూ. 1,440 కోట్ల విలువైన ఆప్షనల్ కన్వర్టబుల్ డిబెంచర్లను ఈక్విటీ షేర్లుగా మార్చాలని ATC టెలికాం వొడాఫోన్‌ను కోరింది.
SBI కార్డ్స్: FY24 కోసం ఒక్కో షేరుకు 2.50 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
TCS: USకు చెందిన ఒక సెంట్రల్ బ్యాంక్, దాని సాంకేతికతను ఆధునీకరించడానికి TCS BaNCSతో ఒప్పందం కుదుర్చుకుంది.
JK సిమెంట్: ఇటీవలి వాణిజ్య బొగ్గు గనుల ఇ-వేలంలో "మహాన్ కోల్ బ్లాక్", "వెస్ట్ ఆఫ్ షాడోల్ (సౌత్) కోల్ బ్లాక్" కోసం బిడ్ గెలుచుకున్న JK సిమెంట్ తెలిపింది. అయితే, కేటాయింపుల ఉత్తర్వు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అందలేదు.
అరబిందో ఫార్మా: Mometasone Furoate Monohydrate Nasal Spray కోసం US FDA ఆమోదం పొందింది.
GPT హెల్త్: కంపెనీ Q3 ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ.96.6 కోట్లకు చేరుకుంది. నికర లాభం 37 శాతం పెరిగి రూ.11.5 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి