Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Group, ICICI Lombard, Emami
మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 29 September 2023: యూఎస్ మార్కెట్ ఓవర్‌నైట్ స్వల్ప లాభాలతో ముగిసింది. క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల సెంటిమెంట్‌ను పెంచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. ASX 200, ఇతర మార్కెట్లు 0.3 శాతం పెరగగా, జపాన్ నికాయ్ 0.2 శాతం క్షీణించింది.
ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 23.5 పాయింట్లు లేదా 0.12 శాతం రెడ్ కలర్‌లో 19,633 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ: అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC), తన పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా, అదానీ గ్రీన్ ఎనర్జీ & అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో వాటాను విక్రయించాలని యోచిస్తోంది. ఎంత మేరకు అమ్ముతుందో మాత్రం వెల్లడించలేదు.
ICICI లాంబార్డ్: జులై 2017 నుంచి మార్చి 2022 కాలానికి పన్నులు చెల్లించాలంటూ, ICICI లాంబార్డ్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) ఇంటెలిజెన్స్, టాక్స్ డిమాండ్ & షోకాజ్ డిమాండ్ నోటీసును జారీ చేసింది. మొత్తం రూ. 1,728.90 కోట్ల జీఎస్‌టీ చెల్లించాలని సూచించింది.
బజాజ్ ఆటో, TVS మోటార్: బజాజ్ ఆటో, సెప్టెంబర్‌లో ఏథర్ ఎనర్జీతో ఉన్న గ్యాప్‌ను పూడుస్తోంది. గురువారం నాటికి, ఏథర్ 6,466 రిజిస్ట్రేషన్‌లు చేస్తే, బజాజ్ ఆటో EV రిజిస్ట్రేషన్‌లు 6,423కు పెరిగాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో TVS మోటార్ కూడా మంచి వాటాను పొందింది.
ఎవెరెడీ ఇండస్ట్రీస్: ప్రీమియమైజేషన్‌పై ఫోకస్ పెట్టిన ఈ కంపెనీ, ఎవరెడీ సెగ్మెంట్‌కు శక్తినిచ్చే సబ్-బ్రాండ్‌గా ‘అల్టిమా’ను చూస్తోంది. కొత్తగా లాంచ్ చేసిన అల్టిమా ప్రో ఆల్కలీన్ బ్యాటరీ రేంజ్ 800 శాతం వరకు ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ చెబుతోంది. బొమ్మలు, వీడియో గేమ్‌లు, స్మార్ట్ రిమోట్‌లు, వైర్‌లెస్ కీబోర్డ్‌లు, ట్రిమ్మర్లు, వైద్య పరికరాలు వంటి అధిక-డ్రెయిన్ అప్లికేషన్స్ దీని లక్ష్యం.
సన్ ఫార్మా: ఈ కంపెనీ అనుబంధ సంస్థల్లో ఒకటి, స్టెప్-డౌన్ ఆర్మ్ సన్ ఫార్మా డి మెక్సికోలో మిగిలి ఉన్న 25 శాతం బకాయి షేర్లను కొనుగోలు చేయడానికి సంతకం చేసింది. అనుబంధ సంస్థకు ఇప్పటికే ఆ కంపెనీలో ప్రస్తుతం 75 శాతం షేర్లు ఉన్నాయి.
రియాల్టీ షేర్స్: రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ ప్రకారం... భారతదేశంలోని మొదటి ఏడు నగరాల్లో గృహ విక్రయాలు జులై-సెప్టెంబర్ మధ్య ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 120,280 యూనిట్లకు చేరుకున్నాయి. 2022లో ఇదే కాలంలో విక్రయించిన 88,230 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 36 శాతం పెరిగాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): MSP స్టీల్ & పవర్‌లో తన వాటాను ఓపెన్ మార్కెట్ డీల్స్ ద్వారా అమ్మింది. దీంతో తన వాటా 7.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ తెలిపింది.
ఇమామి: 'అలోఫ్రట్' తయారీ కంపెనీ యాక్సియమ్ ఆయుర్వేదలో 26 శాతం వ్యూహాత్మక వాటా కొనుగోలుతో హెల్త్ జ్యూస్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఇమామి ప్రకటించింది. డీల్ వాల్యూ ఎంతో వెల్లడించలేదు.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టుటికోరిన్ కేంద్రంగా పని చేస్తున్న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణన్ శంకరసుబ్రమణ్యం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రెడీగా ఉండండి - అక్టోబర్ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial