Stocks Watch Today, 26 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఆటో లీడర్ Maruti Suzuki ఫలితాలు నేడు
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 26 April 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 34 పాయింట్లు లేదా 0.19 శాతం రెడ్ కలర్‌లో 17,753 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, HDFC లైఫ్, SBI లైఫ్, L&T టెక్. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 268 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 217 కోట్ల నష్టం నుంచి కోలుకుని 23% ఎక్కువ లాభాలను ప్రకటించింది.
బజాజ్ ఆటో: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బజాజ్ ఆటో ఏకీకృత నికర లాభం 2% తగ్గి రూ. 1,433 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 1,469 కోట్లుగా ఉంది.
దాల్మియా భారత్: ఇంధన ధరలను తగ్గించడం & డిమాండ్ పెరగడం ద్వారా నాలుగో త్రైమాసిక లాభం రెండింతలు పెరిగిందని దాల్మియా భారత్ మంగళవారం ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 266 కోట్ల నుంచి రూ. 589 కోట్లకు పెరిగింది.
నిప్పాన్ లైఫ్: నాలుగో త్రైమాసికానికి రూ. 198 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 175 కోట్లుగా ఉంది. ఆదాయం 3% పెరిగి రూ. 348 కోట్లకు చేరుకుంది.
VST ఇండస్ట్రీస్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 69 కోట్లు కాగా, కార్యకలాపాల ద్వారా రూ. 389 కోట్ల ఆదాయం వచ్చింది.
సిప్లా: తమ US విభాగం మాడిసన్ ఫార్మాస్యూటికల్స్‌ను ఈ నెల 28 నుంచి మూసేస్తామని సిప్లా తెలిపింది.
మహీంద్ర లైఫ్ స్పేస్: 2022-23 నాలుగో త్రైమాసికంలో మహీంద్ర లైఫ్ స్పేస్ నికర లాభం కేవలం రూ.0.54 కోట్లుగా నమోదైంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 138 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 255 కోట్లుగా ఉంది.
ర్యాలీస్ ఇండియా: జనవరి-మార్చి మధ్య కాలంలో రాలిస్ ఇండియా నికర నష్టం రూ. 69 కోట్లకు పెరిగింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ. 14 కోట్లు. త్రైమాసికంలో రూ. 522 కోట్ల ఆదాయం వచ్చింది.
మహీంద్ర CIE ఆటోమోటివ్: నాలుగో త్రైమాసికంలో రూ. 279 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రూ. 2,440 కోట్ల ఆదాయం సమకూరింది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం 23% పెరిగి రూ. 425 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 1,213 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.