Stocks Watch Today, 08 June 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Tech Mahindra, Sula Vineyards
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 08 June 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.20 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 19 పాయింట్లు లేదా 0.10 శాతం గ్రీన్ కలర్‌లో 18,831 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టిటాగర్ వేగన్స్: ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా, ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను జారీ చేసి నిధులు సేకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి, ఆమోదించడానికి టిటాగర్ వ్యాగన్స్ డైరెక్టర్ల బోర్డ్ ఈ నెల 10న సమావేశం అవుతుంది.
లెమన్ ట్రీ హోటల్స్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 60 గదులున్న హోటల్ కోసం లైసెన్స్ ఒప్పందంపై లెమన్ ట్రీ హోటల్స్ సంతకం చేసింది. FY25లో Q3 నాటికి ఈ హోటల్ వ్యాపారం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
సులా వైన్‌యార్డ్స్: కొత్త CFOను సులా వైన్‌యార్డ్స్ ప్రకటించింది. నాసిక్‌లో ఉన్న ఐకానిక్ బియాండ్ రిసార్ట్‌లో (Beyond resort) మూడు కొత్త లగ్జరీ విల్లాలను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
హాట్సన్ ఆగ్రో: కంపెనీకి చెందిన విండ్‌మిల్ విభాగాన్ని విక్రయించడానికి హ్యాట్సన్ ఆగ్రో డైరెక్టర్ల బోర్డు వచ్చే నెల 5న సమావేశం అవుతుంది. ఆ విభాగానికి సంబంధించిన అన్ని ఆస్తులు, అప్పులను స్లంప్ సేల్ ప్రాతిపదికన బదిలీ చేస్తుంది.
విప్రో: ప్రైవేట్ 5G-యాజ్-ఎ-సర్వీస్ సొల్యూషన్స్‌ను విప్రో & సిస్కో లాంచ్ చేశాయి. కంపెనీల డిజిటల్ ఫార్మేషన్‌ను ఈ కొత్త సర్వీస్ వేగవంతం చేస్తుంది.
టాటా ఎల్‌క్సీ: రాబోయే గగన్‌యాన్ మిషన్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌తో (ఇస్రో) టాటా ఎల్‌క్సీ ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ మిషన్ రికవరీ టీమ్ శిక్షణ కోసం టాటా ఎల్‌క్సీ క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్‌ను (CMRM) డిజైన్ చేసి, రూపొందిస్తుంది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్: బాసెల్-111 కంప్లైంట్ అడిషనల్ టైర్-1 బాండ్లు లేదా టైర్-IT బాండ్లను జారీ చేసి రూ. 750 కోట్ల వరకు మూలధనాన్ని సమీకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 12న సమావేశం అవుతుంది. ఈ బాండ్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో 12 నెలల్లోపు జారీ చేయాలన్నది ప్రతిపాదన.
జైడస్ లైఫ్: తడలఫిల్ టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.
డి-లింక్ ఇండియా: ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా బుధవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా, స్మాల్ క్యాప్ కంపెనీ డి-లింక్ ఇండియాలో కొంత వాటాను అమ్మేశారు.
టెక్ మహీంద్ర: భారతదేశంలో అతి పెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), IT సేవల సంస్థ టెక్ మహీంద్రలో తన వాటాను పెంచుకుంది.
ఇది కూడా చదవండి: బ్రిటిష్ కాలం నాటి బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ & బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.