Stocks To Watch 06 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Wilmar, Ujjivan, Marico
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 06 July 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 24 పాయింట్లు లేదా 0.12 శాతం రెడ్ కలర్‌లో 19,488 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ విల్మార్: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో, 25%తో రెండంకెల బలమైన వాల్యూమ్ గ్రోత్‌ను అదానీ విల్మార్ అప్‌డేట్ చేసింది. అయితే, ఎడిబుల్ ఆయిల్ ధరలు బాగా తగ్గడం వల్ల అమ్మకాలు 15% క్షీణించాయి.
DCB బ్యాంక్: బ్యాంక్‌లో 7.5% వరకు వాటా కొనుగోలు చేసేందుకు టాటా AMCకి రిజర్వ్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
బయోకాన్: బయోకాన్ సబ్సిడియరీ అయిన బయోకాన్ బయోలాజిక్స్, తాను కొనుగోలు చేసిన బయోసిమిలర్స్ వ్యాపారాన్ని 70కి పైగా ఎమర్జింగ్ కంట్రీస్‌లో ఇంటిగ్రేట్ చేసినట్లు ప్రకటించింది.
మ్యారికో: మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన లోయర్-సింగిల్ డిజిట్‌లో క్షీణించింది. గత సంవత్సరం, కీలక దేశీయ పోర్ట్‌ఫోలియోల్లో ప్రైస్ ఇంటర్వెన్షన్స్, సఫోలా ఎడిబుల్ ఆయిల్స్‌లో ధర తగ్గుదల కారణంగా ఆదాయం తగ్గింది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ అడ్వాన్సులు 31% పెరిగి రూ.25,346 కోట్లకు చేరగా, డిపాజిట్లు 44% పెరిగి రూ.26,655 కోట్లకు చేరుకున్నాయి.
LTIమైండ్‌ట్రీ: జీరో ట్రస్ట్ డేటా సెక్యూరిటీ కంపెనీ అయిన రుబ్రిక్‌తో కలిసి, ‘LTIMindtree V-Protect’ అనే సమగ్ర సైబర్ రికవరీ & డేటా సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను LTIమైండ్‌ట్రీ ప్రారంభించింది.
RPP ఇన్‌ఫ్రా: రూ. 289 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ను RRP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అందుకుంది.
KEC ఇంటర్నేషనల్: తన వివిధ వ్యాపారాల కోసం రూ.1,042 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను KEC ఇంటర్నేషనల్ దక్కించుకుంది.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్: తన అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ ఎక్సోరా బిజినెస్ పార్క్స్‌తో కలిసి, చెన్నైలో IT పార్కుల అభివృద్ధి కోసం WS ఇండస్ట్రీస్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది.
సోలారా యాక్టివ్ ఫార్మా: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (MD & CEO) పూర్వాంక్ పురోహిత్ నియామకాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
JSW స్టీల్: BSE సెన్సెక్స్‌లో, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) స్థానంలోకి ఈ నెల 13 నుంచి JSW స్టీల్ లిమిటెడ్ అడుగు పెడుతుంది.
ఇది కూడా చదవండి: ఈఎంఐ భారం పెంచనున్న టమాట! ఆర్బీఐపై 'కూరగాయాల' ప్రెజర్!!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial