(Source: ECI/ABP News/ABP Majha)
Stocks to watch 28 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Punjab & Sind Bank
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 28 December 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 92 పాయింట్లు లేదా 0.51 శాతం రెడ్ కలర్‌లో 18,055 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
పంజాబ్ & సింధ్ బ్యాంక్: ఈక్విటీ & డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా రూ. 250 కోట్లు సమీకరించే అంశాన్ని పరిశీలించడానికి, ఆమోదించడానికి పంజాబ్ & సింధ్ బ్యాంక్ బోర్డు శుక్రవారం (30 డిసెంబర్ 2022) సమావేశమవుతుంది. 2022 సెప్టెంబర్ 30 నాటికి, ఈ ప్రభుత్వ రంగ రుణదాత మూలధన సమృద్ధి నిష్పత్తి 15.68 శాతంగా ఉంది.
MOIL: ఈ మైనింగ్ కంపెనీకి 2025 వరకు ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా అజిత్ కుమార్ సక్సేనాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం, ఉషా సింగ్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్: రుణాల్లో కూరుకుపోయిన రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్, తన వ్యాపార కార్యకలాపాలను 2023లో పునఃప్రారంభించగలనని ఆశాభావం వ్యక్తం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 2018లో విధించిన దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళిక (corrective action plan) నుంచి, OTS ప్రక్రియ పూర్తి కాగానే రెలిగేర్ ఫిన్‌వెస్ట్ బయటకు వస్తుంది.
ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్: కంపెనీ వినోద్ కుమార్ పనికర్‌ను సోమవారం (26 డిసెంబర్ 2022) నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమించింది. కంపెనీలో చేరడానికి ముందు, పనికర్ 9 సంవత్సరాలు ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ CFO గా ఉన్నారు.
సిక్కో ఇండస్ట్రీస్: కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ.0.15 మధ్యంతర డివిడెండ్‌తో ఎక్స్ డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి. మంగళవారం కంపెనీ షేర్లు 2 శాతం లాభంతో రూ. 104.85 వద్ద ముగిశాయి.
అద్వైత్ ఇన్‌ఫ్రాటెక్: కంపెనీ షేర్లు ఎక్స్ బోనస్‌తో ట్రేడ్ అవుతాయి. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్ల కేటాయింపు కోసం BSE నుంచి ఈ కంపెనీకి సూత్రప్రాయ ఆమోదం లభించింది.
కాప్రి గ్లోబల్: షేర్ రైట్స్ ఇష్యూకి సంబంధించిన పరిమాణం, ధరలను పరిశీలించడానికి, చర్చించడానికి, నిర్ణయించడానికి కంపెనీ బోర్డు సమావేశమవుతుంది.
అలెగ్జాండర్ స్టాంప్స్ & కాయిన్స్: షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ గురించి చర్చించడానికి కంపెనీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.
యునిస్టార్ మల్టీమీడియా: క్యాష్ లేదా స్టాక్ డీల్ ద్వారా 'డు పాయింట్ లాయల్టీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్' (Du Point Loyalty Distribution Private Limited) కొనుగోలు లావాదేవీ గురించి చర్చించడానికి, ఆమోదించడానికి కంపెనీ బోర్డు సమావేశమవుతుంది.
NMS రిసోర్సెస్: కంపెనీ డైరెక్టర్‌గా ఇషా గుప్తా నియామకాన్ని పరిశీలించడానికి కంపెనీ బోర్డు సమావేశం అవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.