Stocks to watch 25 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - గుడ్‌న్యూస్ చెప్పిన Biocon, PNB
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
![Stocks to watch 25 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - గుడ్‌న్యూస్ చెప్పిన Biocon, PNB Stocks to watch in todays trade 25 November 2022 todays stock market shares share market Stocks to watch 25 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - గుడ్‌న్యూస్ చెప్పిన Biocon, PNB](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/c39162c4cbcccd5c733047176cb2a8371669344599235545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stocks to watch today, 25 November 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 52 పాయింట్లు లేదా 0.28 శాతం రెడ్ కలర్‌లో 18,615 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
లుపిన్: మండిదీప్‌లో ఔషధ ఉత్పత్తి ఫ్లాంటు, API ఫ్లాంటుకు USFDA 8 పరిశీలనలను జారీ చేసింది. ఈ నెల 14-23 తేదీల మధ్య ఈ కంపెనీలో US డ్రగ్ రెగ్యులేటర్ తనిఖీలు చేసింది.
బయోకాన్: వియాట్రిస్ ఇంక్‌కు (Viatris Inc) చెందిన బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు బయోకాన్ అనుబంధ సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ చేసేందుకు, ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌లో భాగంగా రూ. 2,205.63 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ వ్యాపారం కొనుగోలు కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: UTI అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఏకమొత్తంలోగానీ, దఫదఫాలుగా గానీ వాటాల ఉపసంహరణకు ఈ ప్రభుత్వ రంగ రుణదాతకు దీపమ్ (DIPAM) ఆమోదం లభించింది. UTI AMCలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 15.22 శాతం వాటా ఉంది.
లారస్ ల్యాబ్స్: ఈథాన్ ఎనర్జీ ఇండియాలో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఈ ఫార్మా కంపెనీ షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం, వాటాదారుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని వల్ల, ఈథాన్ ఎనర్జీ ఇండియా 10 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే మొత్తం సౌరశక్తిని లారస్ ల్యాబ్ వినియోగించుకోగలుగుతుంది.
PTC ఇండియా: ఈ పవర్ ట్రేడింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ ఏకీకృత నికర లాభం 2022 మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరిగి రూ.157.11 కోట్లకు చేరుకుంది. తక్కువ ఖర్చుల కారణంగా లాభం పెరిగింది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.49.77 కోట్లు.
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా: వ్యర్థాలను ద్రవ/ఘన ఇంధనాలుగా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ కంపెనీ అయిన ఎక్స్2ఫ్యూయల్స్ అండ్ ఎనర్జీలో (X2Fuels and Energy) 50 శాతం వాటాను రూ. 6.15 కోట్లకు ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా కొనబోతోంది. ఇందుకోసం షేర్ల సబ్‌స్క్రిప్షన్ ఒప్పందంపై సంతకం చేసింది.
SJVN: ఉత్తరప్రదేశ్‌లోని పరాసన్ సోలార్ పార్క్‌లో 75 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ఈ కంపెనీ తెలిపింది. 75 మెగావాట్ల పరాసన్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావడంతో, ఈ విద్యుత్ ఉత్పత్తి కంపెనీ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2,091.5 మెగావాట్లకు చేరింది.
హరిఓం పైప్ ఇండస్ట్రీస్: 15 టన్నుల ఎలక్ట్రిక్ మెల్టింగ్ ఫర్నేస్ నిర్మాణాన్ని ఈ మెటల్ పైపుల తయారీ సంస్థ పూర్తి చేసింది. దీని నుంచి వాణిజ్య ఉత్పత్తి నేటి నుంచి ప్రారంభమవుతుంది. దీంతో, కంపెనీ MS బిల్లెట్‌ల ఉత్పత్తి ప్రస్తుతమున్న 95,832 MTPA నుంచి 1.04 లక్షల MTPAకు చేరుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)