News
News
వీడియోలు ఆటలు
X

Stocks to watch 21 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లోకొచ్చిన Mahindra

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 21 March 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 56 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,081 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

HDFC AMC: అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికన్‌ GQG పార్ట్‌నర్స్, సోమవారం బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా HDFC  అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో (AMC) వాటాను విక్రయించింది.

PVR: విదేశీ పెట్టుబడి సంస్థ బెర్రీ క్రీక్ ఇన్వెస్ట్‌మెంట్, మల్టీప్లెక్స్ చైన్ ఆపరేటర్ PVR లిమిటెడ్‌లో తనకున్న మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది.

సియట్‌: సియట్‌ MD & CEO పదవికి అనంత్ గోయెంకా రాజీనామా చేశారు. ప్రస్తుతం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న అర్నాబ్‌ బెనర్జీ కొత్త MD & CEOగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అదానీ పోర్ట్స్: గుజరాత్‌లోని ముంద్ర పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సంస్థలతో రుణ వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది. ఫైనాన్షియల్ క్లోజర్ కోసం ప్రయత్నిస్తున్నట్లు, ఫైనాన్షియల్ క్లోజర్‌ తర్వాత ఆ సైట్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

లుపిన్: కొత్త డ్రగ్ అప్లికేషన్ రోకురోనియం బ్రోమైడ్ ఇంజెక్షన్ కోసం, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తమ కూటమి భాగస్వామి కాప్లిన్ స్టెరిల్స్ తుది ఆమోదం పొందినట్లు లుపిన్ ప్రకటించింది.

స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ: రాన్ ఆఫ్ కచ్‌లోని ఖవ్డా RE పవర్ పార్క్‌లో, NTPC రెన్యువబుల్ ఎనర్జీ ఏర్పాటు చేయతలపెట్టిన 1200 mw సోలార్ PV ప్రాజెక్టు BOS ప్యాకేజీలో విజయవంతమైన బిడ్డర్‌గా ఈ కంపెనీ నిలిచింది. మొత్తం బిడ్ విలువ రూ. 2,100 కోట్లు.

మహీంద్ర & మహీంద్ర లిమిటెడ్ మిత్ర ఆగ్రో ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కొనుగోలును మహీంద్ర అండ్ మహీంద్ర సంపూర్ణం చేసింది. ఈ లావాదేవీతో ప్రస్తుతమున్న వాటాను 47.33% నుంచి 100%కి పెంచుకుంది. మిత్ర ఆగ్రో ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఇప్పుడు మహీంద్ర & మహీంద్ర గ్రూప్‌ కంపెనీగా మారింది.

RBL బ్యాంక్: కొన్ని నిబంధనలను పాటించనందుకు RBL బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 2.27 కోట్ల నగదు జరిమానా విధించింది.

డాక్టర్ రెడ్డీస్: న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే 'కోయా 302' అభివృద్ధి, విక్రయాల కోసం, ప్రతిపాదిత బయోసిమిలర్ అబాటాసెప్ట్ లైసెన్స్ కోసం కోయా థెరప్యూటిక్స్ డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్: పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లను నిర్వహిస్తున్న వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, సౌరభ్ కల్రాను మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 21 Mar 2023 08:01 AM (IST) Tags: Share Market Stock Market HDFC AMC CEAT RBL Bank and Adani Ports

సంబంధిత కథనాలు

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

IEX: 'పపర్‌' తగ్గిన ఐఈఎక్స్‌, రెండ్రోజుల్లో 23% ఆవిరి - ఏం జరుగుతోంది?

IEX: 'పపర్‌' తగ్గిన ఐఈఎక్స్‌, రెండ్రోజుల్లో 23% ఆవిరి - ఏం జరుగుతోంది?

Latest Gold-Silver Price Today 09 June 2023: షాక్‌ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Latest Gold-Silver Price Today 09 June 2023: షాక్‌ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Income Tax: ఎలాంటి బహుమతులపై ఇన్‌కం టాక్స్‌ కట్టక్కర్లేదు?

Income Tax: ఎలాంటి బహుమతులపై ఇన్‌కం టాక్స్‌ కట్టక్కర్లేదు?

టాప్ స్టోరీస్

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్