Stocks to watch 16 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - IndiGo షేర్లతో జాగ్రత్త!
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 16 February 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 44 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్ కలర్‌లో 18,065 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
నెస్లే: జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ సంవత్సరాన్ని అనుసరించే కంపెనీ, తన నాలుగో త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 6 నుంచి 9 శాతం మధ్య (మిడ్-హై సింగిల్ డిజిట్) అమ్మకాల వృద్ధిని రిపోర్ట్ చేస్తుందని మార్కెట్ అంచనా వేసింది. EBITDA మార్జిన్ తగ్గుతుందన్న అంచనా కూడా ఉంది.
ఇండిగో: నివేదికల ప్రకారం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) ప్రమోటర్లు ఇవాళ బ్లాక్ డీల్ ద్వారా 350 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాలని చూస్తున్నారు.
టైమ్ టెక్నోప్లాస్ట్: CNG క్యాస్‌కేడ్‌ల సరఫరా కోసం అతి పెద్ద సింగిల్ ఆర్డర్ అందుకున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఆర్డర్ మొత్తం విలువ రూ. 134 కోట్లు. ఒక సంవత్సరం వ్యవధిలో సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది.
పటేల్ ఇంజనీరింగ్: తన జాయింట్ వెంచర్ పార్టనర్లతో కలిసి మధ్యప్రదేశ్ & మహారాష్ట్రలో రూ. 1,567 కోట్ల విలువైన ప్రాజెక్టులకు L1 బిడ్డర్‌గా నిలిచింది. ఆర్డర్ బుక్ రూ. 16,809 కోట్లుగా ఉంది.
PTC ఇండస్ట్రీస్: PTC ఇండస్ట్రీస్ & హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏవియేషన్ గ్రేడ్ ముడి పదార్థాలు, విడి భాగాలు, ఉప-వ్యవస్థలు, రష్యన్ తయారీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేయడానికి పరస్పర సహకారం కోసం ఈ డీల్ మీద సంతకాలు చేశాయి.
జైడస్ లైఫ్ సైన్సెస్: Canagliflozin టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్ లైఫ్ సైన్సెస్‌కు తాత్కాలిక ఆమోదం లభించింది.
NTPC: ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న పవర్ దిగ్గజం NTPC, కొత్త & కొనసాగుతున్న ప్రాజెక్టులపై తన మూలధన వ్యయానికి ఆర్థిక సహాయం చేయడానికి జపనీస్ యెన్ రూపంలో సుమారు రూ. 6,213 కోట్ల విలువైన టర్మ్ లోన్ తీసుకోవాలని యోచిస్తోంది.
టాటా స్టీల్: స్టీల్ మేజర్ టాటా స్టీల్ భారీగా నిధుల సేకరణ చేయబోతోంది. ఇందుకోసం రూ. 4,000 కోట్ల విలువైన బాండ్స్‌ను విక్రయించాలని ప్లాన్ చేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.