By: ABP Desam | Updated at : 13 Jan 2023 08:14 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 13 జనవరి 2023
Stocks to watch today, 13 January 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 63 పాయింట్లు లేదా 0.35 శాతం గ్రీన్ కలర్‌లో 17,981 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇన్ఫోసిస్: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ ఐటీ కంపెనీ ఏకీకృత ఆదాయం 20.2% వార్షిక వృద్ధితో (YoY) రూ. 38,318 కోట్లకు చేరింది, ఇది విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా ఉంది. ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 13.4% పెరిగి రూ. 6,586 కోట్లకు చేరుకుంది, దాదాపుగా ఆశించిన స్థాయిలో ఉంది. FY23కి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి మార్గదర్శకాన్ని గతంలోని 15-16% నుంచి 16-16.5%కి పెంచి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.
HCL టెక్నాలజీస్: ఈ కంపెనీ కూడా అంచనాలను దాటి ఫలితాలు సాధించింది. 2022 డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 19% వృద్ధితో 4.096 కోట్ల రూపాయలను నమోదు చేసింది. ఆదాయం కూడా గత ఏడాది ఇదే కాలం కంటే దాదాపు 20% పెరిగి రూ. 26,700 కోట్లకు చేరుకుంది. ఈ సాఫ్ట్‌వేర్ మేజర్, FY23 కోసం తన స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి మార్గదర్శకాన్ని రెండోసారి కూడా తగ్గించింది, గతంలోని 13.5-14.5% నుంచి 13.5-14.0%కి కుదించింది.
సైయెంట్: అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో బలహీన డిమాండ్‌ను ఎదుర్కొని, డిసెంబర్ త్రైమాసికానికి మంచి నంబర్లను ఈ కంపెనీ పోస్ట్ చేసింది. ఇతర కంపెనీల కొనుగోళ్ల కారణంగా, Q3 ఆదాయంలో కంపెనీ గురువారం ఊహించిన దాని కంటే మెరుగ్గా 37% జంప్‌ను నివేదించింది. ఈ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 1,618 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 1,183 కోట్లుగా ఉంది.
విప్రో: ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇవాళ తన Q3FY23 సంఖ్యలను విడుదల చేస్తుంది. డిసెంబర్ త్రైమాసికంలో, సంవత్సరం ప్రాతిపదికన (YoY) రెండంకెల ఆదాయ వృద్ధిని నివేదించే అవకాశం ఉంది. అయితే బాటమ్‌లైన్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఎనిమిది మంది విశ్లేషకుల సగటు అంచనాల ప్రకారం ఏకీకృత ఆదాయం 15% YoY, 3.5% QoQ పెరిగి రూ. 23,332 కోట్లకు చేరుకోవచ్చు. నికర లాభం YoYలో 3% తగ్గి రూ. 2,890 కోట్లకు చేరుకునే అవకాశం ఉండగా, QoQలో 9% పెరగవచ్చు.
శ్రీరామ్ ఫైనాన్స్: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపాక్స్ పార్ట్‌నర్స్ (Apax Partners), ఇవాళ బ్లాక్ డీల్ ద్వారా ఈ కంపెనీలో తన మొత్తం వాటాను విక్రయించే అవకాశం ఉంది. అపాక్స్ పార్ట్‌నర్స్‌తో అనుసంధానంగా ఉన్న డైనాస్టీ అక్విజిషన్‌కు (FPI)
శ్రీరామ్ ఫైనాన్స్‌లో 4.63% వాటా లేదా 173 లక్షల షేర్లు ఉన్నాయి. దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన ఈ డీల్, గురువారం షేర్ ముగింపు ధర రూ. 1,312.6 కన్నా 6% డిస్కౌంట్‌లో జరుగుతుందని అంచనా.
L&T టెక్నాలజీ సర్వీసెస్: తన మాతృ సంస్థ లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro) అధీనంలో ఉన్న స్మార్ట్ వరల్డ్ & కమ్యూనికేషన్ (Smart World & Communication) వ్యాపారాన్ని రూ. 800 కోట్లకు కొనుగోలు చేసేందుకు L&T టెక్నాలజీ సర్వీసెస్ ఒప్పందం కుదుర్చుకుంది. మూడు నెలల్లో కొనుగోలు పూర్తవుతుందని అంచనా.
వన్97 కమ్యూనికేషన్స్ (Paytm): చైనాకు చెందిన అలీబాబా గ్రూప్, Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 2.95% వాటాను గురువారం బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా రూ. 1,031 కోట్లకు విక్రయించింది. కంపెనీకి చెందిన 1,92,00,000 షేర్లను రూ. 536.95 చొప్పున విక్రయించినట్లు బల్క్ డీల్స్ డేటా ద్వారా తెలుస్తోంది. బుధవారం నాటి షేర్ ముగింపు ధర కంటే 7% పైగా డిస్కౌంట్‌లో వాటా విక్రయం జరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్