Stocks to watch 09 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Kirloskar Oilతో జాగ్రత్త!
స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 09 March 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 5 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్ కలర్‌లో 17,803 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
Kirloskar Oil: కిర్లోస్కర్ ఆయిల్: కొన్ని బ్లాక్ డీల్స్ ద్వారా, కిర్లోస్కర్ ఆయిల్‌లో దాదాపు 18% వాటాను రూ. 825 కోట్లకు ఆఫ్‌లోడ్ చేశారు. దివంగత గౌతమ్ కులకర్ణి కుటుంబానికి చెందిన సంస్థలు, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన సంస్థలు ఈ స్టేక్‌ను విక్రయించాయి.
భారత్ ఫోర్జ్: తన ఈ-మొబిలిటీ అనుబంధ సంస్థ కళ్యాణి పవర్‌ట్రెయిన్ ద్వారా, MIDC చకాన్‌లో మొదటి ఈ-బైక్ తయారీ కేంద్రాన్ని మార్చి 8న భారత్ ఫోర్జ్ ప్రారంభించింది. ఈ ఫ్లాంటు ద్వారా సంవత్సరానికి 60,000 యూనిట్ల ఉత్పత్తి చేయవచ్చు, ఈ సామర్థ్యాన్ని సంవత్సరానికి 1,00,000 యూనిట్లకు పెంచుకోవచ్చు.
ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్: చోళ ఇన్వెస్ట్ కంపెనీలో నియంత్రణ వాటాను తాము కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఖండించింది.
జూబిలెంట్ ఫార్మోవా: తన API తయారీ కేంద్రంలో తనిఖీలు చేసిన USFDA, ఆ కేంద్రానికి 'వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్' వర్గీకరణను కేటాయించిందని జుబిలెంట్ ఫార్మోవా ప్రకటించింది.
అదానీ గ్రూప్ స్టాక్స్: NSE సర్క్యులర్ ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ విల్‌మార్‌ను గురువారం నుంచి అమలులోకి వచ్చేలా స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ కిందకు మళ్లీ తీసుకువచ్చారు.
అలెంబిక్ ఫార్మా: కొత్త డ్రగ్ అప్లికేషన్ (ANDA) ఫ్రాజోసిన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్ కోసం US ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తుది ఆమోదం పొందినట్లు అలెంబిక్ ఫార్మా ప్రకటించింది.
SBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.25% కూపన్ రేటుతో మూడో బాసెల్ III కంప్లైంట్ అడిషనల్ టైర్-1 బాండ్ల జారీ ద్వారా రూ. 3,717 కోట్లను ఈ బ్యాంక్ సమీకరించింది.
NRB బేరింగ్స్: రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్, NRB బేరింగ్స్ క్రెడిట్ రేటింగ్‌ను AA-/ స్టేబుల్‌గా, కమర్షియల్ పేపర్ ఇన్‌స్ట్రుమెంట్లకు A1+ రేటింగ్‌ను కొనసాగించింది.
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్: ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజ్ దివాలా పరిష్కారానికి అంగీకారం లభించింది, బకాయిలను వసూలు చేయడానికి ఈ సంస్థను వేలం వేస్తారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.