By: ABP Desam | Updated at : 08 Feb 2023 08:13 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ - 08 ఫిబ్రవరి 2023
Stocks to watch today, 08 February 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 59 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్ కలర్‌లో 17,789 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
భారతి ఎయిర్‌టెల్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ అదరగొట్టింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 92% పెరిగి రూ. 1,588 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం సంవత్సరానికి 20% పెరిగి రూ. 35,804 కోట్లకు చేరుకుంది.
హీరో మోటోకార్ప్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో స్వల్పంగా 4% వృద్ధిని నమోదు చేసి రూ. 711 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగి రూ. 8,031 కోట్లకు చేరుకుంది.
అంబుజా సిమెంట్స్: డిసెంబర్ త్రైమాసికంతో ముగిసిన మూడు నెలల్లో ఈ సిమెంట్ కంపెనీ రూ. 488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 431 కోట్లతో పోలిస్తే లాభం 13% ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4% పెరిగి రూ. 8,036 కోట్లకు చేరుకుంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ: కంపెనీ ఏకీకృత నికర లాభం డిసెంబర్ త్రైమాసికంలో రెట్టింపు పైగా పెరిగి రూ. 103 కోట్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి (YoY) 110% వృద్ధి. మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం 53% పెరిగి రూ. 2,258 కోట్లకు చేరుకుంది.
ఆస్ట్రల్: 1:3 నిష్పత్తిలో ఈక్విటీ షేర్ల బోనస్ ఇష్యూను ఆస్ట్రల్ లిమిటెడ్ ప్రకటించింది. అంటే, అర్హుడైన షేర్‌హోల్డర్ కలిగి ఉన్న ప్రతి మూడు ఈక్విటీ షేర్లకు ఒక అదనపు వాటాను కంపెనీ ఇస్తుంది.
ఫీనిక్స్ మిల్స్: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 176 కోట్లుగా లెక్క తేలింది, చాలా తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 988 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం డిసెంబరు త్రైమాసికంలో రూ. 683 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 425 కోట్ల ఆదాయం సంపాదించింది.
BSE: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్‌లో (CDSL) 2.5% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) మార్గంలో ఉపసంహరించుకోవడానికి తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ప్రకటించింది.
అరబిందో ఫార్మా: ఆరోలైఫ్ ఫార్మా డిక్లోఫెనాక్ సోడియం టాపికల్ సొల్యూషన్ USPని తయారు చేయడానికి, ఆమెరికాలో మార్కెట్ చేయడానికి US ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తుది ఆమోదాన్ని పొందింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Fraud alert: పేమెంట్ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్!
Cryptocurrency Prices: రూ.24 లక్షల వద్ద బిట్‌కాయిన్‌కు స్ట్రాంగ్ రెసిస్టెన్స్!
Laxman Narasimhan: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!
Stock Market News: ఫైనాన్స్ షేర్లు కుమ్మేశాయ్ - సెన్సెక్స్ 445, నిఫ్టీ 119 పెరిగేశాయ్!
Small Cap Favourites: బీమా కంపెనీల ఇష్టసఖులు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్, తెగ కొంటున్నాయ్!
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా