News
News
X

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 01 February 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 118 పాయింట్లు లేదా 0.66 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,870 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా నెగెటివ్‌ సెంటిమెంట్స్‌ ఉన్నప్పటికీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల FPO చివరి రోజున పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు లీడ్‌ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కేటగిరీ ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది.

సన్‌ ఫార్మా: డిసెంబరు 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, ఇది గత సంవత్సరం కాలంతో పోలిస్తే 5% పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.2,058 కోట్లు.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌: ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) స్వతంత్ర నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 92% తగ్గి రూ. 448 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,860 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

UPL: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 16% పెరిగి రూ. 1,087 కోట్లకు చేరింది. అయితే, మార్కెట్‌ అంచనా అయిన రూ. 1,255 కోట్ల కంటే ఇది చాలా తక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాదికి 21% పెరిగి రూ. 13,679 కోట్లకు చేరుకుంది.

లుపిన్‌: ఫార్మా మేజర్ లుపిన్, తన డోలుటెగ్రావిర్, ఎమ్ట్రిసిటాబైన్, టెనోఫోవిర్ అలఫెనామైడ్ (DETAF) టాబ్లెట్ల కోసం పెట్టుకున్న కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి తాత్కాలిక అనుమతి పొందింది.  భారతదేశంలోని నాగ్‌పుర్ కేంద్రంలో ఈ ఔషధాలను లుపిన్‌ తయారు చేస్తుంది.

ఆటో స్టాక్స్‌: ఆటో కంపెనీలు, 2023 జనవరి నెల విక్రయాల గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో వాహన కంపెనీల షేర్ల మీద ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్: భారతదేశంలో పెట్రోలియం కోక్ అమ్మకాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిపివేసింది. ఈ కంపెనీ రిఫైనరీలకు ఇంధనంగా ఉపయోగించే సింథటిక్ గ్యాస్‌గా మార్చడానికి ఆ ఉత్పత్తి దిగుమతులను పెంచిందని రాయిటర్స్ రిపోర్ట్‌ చేసింది.

కోల్‌ ఇండియా: 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం రూ.7,719 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని రూ. 4,556 కోట్లతో పోలిస్తే లాభం 69% పెరిగింది. FY23 కోసం, ఒక్కో షేరుకు రూ. 5.25 రెండో మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఈ కంపెనీ ప్రకటించింది.

వొడాఫోన్‌ ఐడియా: ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 1,600 కోట్ల విలువైన డిబెంచర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూను వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ మళ్లీ ఆమోదించింది. Vodafone Idea భారతదేశంలో ATCకి అతి పెద్ద కస్టమర్.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 01 Feb 2023 08:12 AM (IST) Tags: Stock market Vodafone Idea Share Market COAL INDIA Q3 Results Sun Pharma Adani Enterprises

సంబంధిత కథనాలు

Hindenburg On Block : మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ 'బ్లాక్' వంతు

Hindenburg On Block : మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ 'బ్లాక్' వంతు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Infosys: ఇన్ఫోసిస్‌ నుంచి కిరణ్ మజుందార్‌ షా రిటైర్మెంట్‌! కొత్తగా..!

Infosys: ఇన్ఫోసిస్‌ నుంచి కిరణ్ మజుందార్‌ షా రిటైర్మెంట్‌! కొత్తగా..!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Stock Market News: ఫెడ్‌ రేట్ల పెంపుతో బ్యాంక్స్‌ స్టాక్స్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

Stock Market News: ఫెడ్‌ రేట్ల పెంపుతో బ్యాంక్స్‌ స్టాక్స్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి