అన్వేషించండి

Stock Market Holiday: మే 20న స్టాక్‌ మార్కెట్‌కు సెలవు, కారణం ఏంటో చెప్పిన NSE

ఈ నెలలోనూ (2024 ఏప్రిల్‌) స్టాక్‌ మార్కెట్లకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి.

Stock Market Holiday: లోక్‌సభ ఎన్నికల కారణంగా స్టాక్‌ మార్కెట్‌కు వచ్చే నెలలో మరో రోజు అదనంగా సెలవు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ‍‌(LokSabha Elections 2024) సందర్భంగా, 2024 మే 20న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE ప్రకటించింది.

2024 లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతాయి. ఈ ఏడు దశలు ఈ నెల 19న ప్రారంభమై, జూన్‌ 01న ముగుస్తాయి. మొత్తం అన్ని దశల ఓటింగ్‌ ఫలితాలను 2024 జూన్‌ 4న ఫలితాలను (Vote Counting Day 2024) ప్రకటిస్తారు. మహారాష్ట్రలోని లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో, మే 20న పోలింగ్‌ జరుగుతుంది. ధులే, దిండోరి, నాసిక్, భివాండి, కళ్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, పాల్ఘర్‌ నియోజకవర్గాల్లో ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రోజున స్టాక్ ఎక్స్ఛేంజ్‌ మూసివేస్తారు. 

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మే 20న స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సెలవు ప్రకటిస్తూ NSE నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెలవు ప్రకటిస్తున్నందున.. నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్‌ల గడువు మే 20కి బదులుగా మే 17న, శుక్రవారం నాడు ముగుస్తుందని తెలిపింది. 

ఈ నెలలోనూ (2024 ఏప్రిల్‌) స్టాక్‌ మార్కెట్లకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి. రంజాన్‌ సందర్భంగా ఈ నెల 11న, శ్రీరామ నవమి సందర్భంగా 17న ట్రేడింగ్ నిర్వహించరు.

2024లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ‍‌(Stock market holidays list for 2024):

ఏప్రిల్ 11, 2024 (గురువారం) - ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ఈద్)
ఏప్రిల్ 17, 2024 (బుధవారం) - శ్రీరామ నవమి
మే 01, 2024 (బుధవారం) - మహారాష్ట్ర దినోత్సవం
మే 20, 2024 (సోమవారం) - లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌
జూన్ 17, 2024 (సోమవారం) - బక్రీద్
జులై 17, 2024 (బుధవారం) - మొహర్రం
ఆగస్టు 15, 2024 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం
అక్టోబర్ 02, 2024 (బుధవారం) - మహాత్మాగాంధీ జయంతి
నవంబర్ 01, 2024 (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ
నవంబర్ 15, 2024 (శుక్రవారం) - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2024 (బుధవారం) - క్రిస్మస్

ఈ ఏడాది దీపావళి సందర్భంగా ముహూరత్‌ ట్రేడింగ్ (Muhurat Trading 2024 Timings) నవంబర్ 1వ తేదీ, శుక్రవారం రోజున ఉంటుంది. ఆ రోజున, ఏ సమయంలో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు ఆ సమయానికి ప్రకటిస్తాయి.

ఈ రోజు ( మంగళవారం, 09 ఏప్రిల్‌ 2024) మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 178.61 పాయింట్లు లేదా 0.24% పెరిగి 74,921.11 దగ్గర; NSE నిఫ్టీ 46.40 పాయింట్లు లేదా 0.20% పెరిగి 22,712.70 వద్ద ట్రేడవుతున్నాయి. 

స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా రికార్డ్ లెవెల్స్‌లో (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారి 75000 మార్క్‌ దాటింది. 75,124.28 దగ్గర కొత్త రికార్డ్‌ ‍(Sensex at fresh all-time high) సృష్టించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,768.40 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) నమోదు చేసింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: వెండి రేటు రూ.లక్ష దాటొచ్చు, ఆశ్చర్యపోకండి, సిల్వర్‌ స్పీడ్‌ అలాగే ఉంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget