Stock Market Update: ఫైర్ మీదున్న స్టాక్ మార్కెట్లు! సెన్సెక్స్ 61,150, నిఫ్టీ 18,212.. సరికొత్త రికార్డులు ఖాయమేనా!!
బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, మార్కెట్లు లాభాల్లో ఉండటం కలిసొచ్చింది. ఆటో, రియాల్టీ, మెటల్, పవర్ కంపెనీల షేర్లు పెరగడంతో మార్కెట్లు కళకళలాడాయి.
వరుసగా నాలుగో సెషన్లోనూ భారత స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం కలిసొచ్చింది. ఆటో, రియాల్టీ, మెటల్, పవర్ కంపెనీల షేర్లు పెరగడంతో మార్కెట్లు కళకళలాడాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 61,150 పైన ముగిసింది. నిఫ్టీ 18,212 వద్ద ముగియడం ప్రత్యేకం.
క్రితం సెషన్లో 60,616 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 61,014 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. ఒకానొక దశలో 60,850 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకినప్పటికీ వెంటనే పుంజుకుంది. 61,218 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
మంగళవారం 18,055 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 18,170 వద్ద ఆరంభమైంది. 18,128 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో 18,227 వద్ద ఇంట్రాడే గరిష్ఠమైన 18,227ను అందుకుంది. చివరికి 156 పాయింట్ల లాభంతో 18,212 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది. ఉదయం 38,719 వద్ద మొదలైన సూచీ 38,604 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత బ్యాంకు షేర్లు రాణించడంతో 38,851 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 38,727 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 35 కంపెనీల షేర్లు లాభపడగా 15 నష్టాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హిందాల్కో 3-5 శాతం మధ్యలో లాభపడ్డాయి. టైటాన్, టీసీఎస్, శ్రీసెమ్, బ్రిటానియా, సిప్లా నష్టపోయాయి.