Stock Market Update: నిన్న రక్త కన్నీరు.. నేడు లాభాల జోరు! సెన్సెక్స్ 700 +, నిఫ్టీ 250 +
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కళకళలాడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 250+ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కీలక సూచీలకు మద్దతు లభించింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కళకళలాడుతున్నాయి. కీలక సూచీలకు మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెన్ కావడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసింది. దాంతో నేడు కొనుగోళ్ల జాతర కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 250+ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
క్రితం సెషన్లో 57,276 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,795 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. అక్కడ్నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో 58,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11:30 గంటలకు 675 పాయింట్ల లాభంతో 57,953 వద్ద కొనసాగుతోంది.
బుధవారం 17,110 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,208 వద్ద భారీ గ్యాప్ అప్‌తో ఆరంభమైంది. ఆ తర్వాత ఊర్ధ్వ ముఖంగా పయనిస్తూ 17,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 220 పాయింట్ల లాభంతో 17,329 వద్ద కొనసాగుతోంది.
Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!
Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ
బ్యాంక్ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 38,246 వద్ద మొదలైన సూచీ 38,023 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 38,412 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 222 పాయింట్ల లాభంతో 38,204 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో 3 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతీ, పవర్‌గ్రిడ్, హిందుస్థాన్ యునిలివర్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు 1-3 శాతం లాభాల్లో ఉన్నాయి.