Stock Market News: సెల్లింగ్ ప్రెజర్! నష్టాల్లోనే సూచీలు.. సెన్సెక్స్ 275 డౌన్
Stock Market at 12 PM: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ 17,129 వద్ద కొనసాగుతోంది.
Stock Market at 12 PM: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం కాస్త కొనుగోళ్ల సందడి కనిపించినా 12 గంటల తర్వాత అమ్మకాలు పెరిగాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఉక్రెయిన్ యుద్ధ భయం, ద్రవ్యోల్బణం వల్ల మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ 17,129 వద్ద కొనసాగుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,595 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,801 వద్ద లాభాల్లోనే మొదలైంది. కొనుగోళ్ల మద్దతుతో 57,845 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా అమ్మకాలు మొదలవ్వడంతో 57,294 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 275 పాయింట్ల నష్టంతో 57,322 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,222 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,289 వద్ద ఓపెనైంది. 17,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు మొదలవ్వడంతో 17,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. సూచీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 95 పాయింట్ల నష్టంతో 17,129 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 35,700 వద్ద మొదలైంది. 35,717 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 35,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 154 పాయింట్ల నష్టంతో 35,375 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభపడగా 41 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఆటో, రిలయన్స్, యూపీఎల్,కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి. టైటాన్, మారుతీ, సిప్లా, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, ఫార్మా కంపెనీల షేర్లు కొనుగోలు చేస్తున్నారు.
25.03.2022
— BSE India (@BSEIndia) March 25, 2022
Closing Sensex Update pic.twitter.com/vnZNmfcH80
Market Update for the day.
— NSE India (@NSEIndia) March 24, 2022
See more> https://t.co/xBwq7mn9EL https://t.co/F6ARBUOvcp #NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/IU5q02WeUi