Stock Market News: రెండు రోజుల మురిపెం! మళ్లీ నష్టాల్లోకి జారుకున్న ఈక్విటీ మార్కెట్లు
Stock Market @ 12PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం వారాంతం కావడం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market @ 12PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం వారాంతం కావడం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,307 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 250కి పైగా నష్టాల్లో ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,911 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,531 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. 57,244 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 57,689 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 252 పాయింట్ల లాభంతో 57,653 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,392 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,242 వద్ద ఓపెనైంది. ఉదయం 17,196 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొంత కొనుగోళ్లు జరగడంతో 17,314 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 87 పాయింట్ల నష్టంతో 17,307 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,514 వద్ద మొదలైంది. 36,248 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 394 పాయింట్ల నష్టంతో 36,421 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభపడగా 40 నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగా షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్, మెటల్ ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి.