Stock Market Update: 3 రోజుల లాభాలకు తెర..! ఆద్యంతం ఒడుదొడుకుల్లోనే మార్కెట్లు
బెంచ్‌మార్క్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. బుల్స్, బేర్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు.
మూడు రోజుల లాభాలకు తెరపడింది. బెంచ్‌మార్క్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. బుల్స్, బేర్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. మొత్తంగా ఐటీ రంగాల షేర్లు మాత్రం ఈ నెల అదరగొట్టాయి.
క్రితం రోజు 57,315 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,567 వద్ద మొదలైంది. ఉదయం నుంచి ఒడుదొడుకుల మధ్యే ట్రేడ్ అయింది. ఒకానొక దశలో 57,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 56,813 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. చివరికి 190 పాయింట్ల నష్టంతో 57,124 వద్ద ముగిసింది.
గురువారం 17,072 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,072 వద్ద ఆరంభమైంది. 17,155 వద్ద గరిష్ఠాన్ని అందుకున్న సూచీ ఆ తర్వాత ఒడుదొడుకులకు గురైంది. 16,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకొంది. చివరికి 68 పాయింట్ల నష్టంతో 17,003 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ 334 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 35,282 వద్ద మొదలైన సూచీ 35,327 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వారాంతం కావడంతో 34,583 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకొని చివరికి 34,857 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 11 కంపెనీలు లాభాల్లో 39 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్, ఆసియన్ పెయింట్స్, విప్రో లాభపడగా గ్రాసిమ్, ఎన్‌టీపీసీ, ఐచర్ మోటార్స్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం నష్టపోయాయి. ఐటీని మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల సూచీలూ ఎర్రబారాయి.
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్
Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్, ఎథిరియమ్ విలువ.. మిగతావీ??
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?
Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.