Stock Market Update: శుక్రవారం రక్తవర్ణం..! సెన్సెక్స్ 889, నిఫ్టీ 263 డౌన్.. మదుపర్ల విలవిల!
వారాంతంలో బేర్స్ పట్టు బిగించాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 889 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 263 పాయింట్ల మేర నష్టపోయాయి. మిగతా సూచీలూ అదే బాట అనుసరించాయి.
స్టాక్ మార్కెట్లు శుక్రవారం మదుపర్లకు చుక్కలు చూపించాయి! వారాంతంలో బేర్స్ పట్టు బిగించాయి. నెగెటివ్ సెంటిమెంటు ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవ్వడం, ద్రవ్యోల్బణం, ఫెడ్ భయాలతో భారత బెంచ్ మార్క్ సూచీలన్నీ రక్తవర్ణంలో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 889 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 263 పాయింట్ల మేర నష్టపోయాయి. మిగతా సూచీలూ అదే బాట అనుసరించాయి.
క్రితం ముగింపు 57,901తో పోలిస్తే సెన్సెక్స్ నేడు మెరుగ్గానే ఆరంభమైంది. 58,021 వద్ద మొదలైంది. ఒకానొక దశలో 58,062 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొన్నా అది కాసేపే ఆనందం మిగిలించింది. 56,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 889 పాయింట్ల నష్టంతో 57,011 వద్ద ముగిసింది.
గురువారం 17,248 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 17,276 వద్ద స్వల్ప లాభాల్లో ఆరంభమైంది. ఇంట్రాడేలో 17,298 వద్ద గరిష్ఠాన్ని అందుకొని అక్కడి నుంచి పతనమైంది. 16,966 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 263 పాయింట్ల నష్టంతో 16,985 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 930 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 36,491 వద్ద మొదలైన సూచీ 36,550 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి వేగంగా పతనమై 35,535 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకొంది. చివరకు 35,618 వద్ద ముగిసింది. సూచీలోని 12 బ్యాంకులూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
నిఫ్టీలోని 50 కంపెనీల్లో 45 నష్టాల్లోనే ముగిశాయి. విప్రో, ఇన్ఫీ, హెచ్‌సీఎల్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా లాభపడగా ఇండస్ ఇండ్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, కొటక్ బ్యాంక్, హింద్‌యునిలివర్ 3-4 శాతం వరకు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీని మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలూ ఎరుపు రంగులో ముగిశాయి.
Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం
Also Read: RBI Penalty on Banks: ఐసీఐసీఐ, పంజాబ్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాకు.. భారీ జరిమానా
Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!
Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్ ఎకానమిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Health Insurance: తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్య బీమా అస్సలు తీసుకోకండి..! ఎందుకంటే..?