Gift Nifty: SGX నిఫ్టీకి గుడ్‌బై - Gift నిఫ్టీ టైమింగ్స్ ఏంటి, ఎక్కడ చెక్ చేయాలి?
SGX నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఈ రోజు నుంచి గిఫ్ట్ నిఫ్టీగా రీబ్రాండ్ అయ్యాయి.

SGX Nifty is now Gift Nifty: ఎస్‌జీఎక్స్ నిఫ్టీ నేటి నుంచి (సోమవారం, 03 జులై 2023) Gift నిఫ్టీ అవతార్‌లోకి మారింది. దీనికి అనుగుణంగా, $7.5 బిలియన్ల డెరివేటివ్ ట్రేడ్ సింగపూర్ ఎక్స్ఛేంజ్ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్‌కు (NSE IX) షిఫ్ట్ అయింది. SGX నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఈ రోజు నుంచి గిఫ్ట్ నిఫ్టీగా రీబ్రాండ్ అయ్యాయి.
నిఫ్టీ50 ఇండెక్స్ ఎలా ఓపెన్ కావచ్చు (పాజిటివ్/ఫ్లాట్/నెగెటివ్) అన్నదానిని, కొన్నేళ్లుగా SGX నిఫ్టీ సూచిస్తోంది. ఉదయం 9:15 గంటలకు ట్రేడింగ్ ఓపెన్ కావడానికి ముందు ట్రేడర్లు SGX నిఫ్టీని చెక్ చేస్తుంటారు. SGX నిఫ్టీ ఇచ్చే సిగ్నల్స్‌కు అనుగుణంగా ఆ రోజు నిఫ్టీ50 సహా మిగిలిన ఇండెక్స్‌లు, ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ట్రేడింగ్‌కు ప్లాన్ చేసుకుంటారు.
గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏమిటి?
Gift Nifty అనేది SGX నిఫ్టీకి తగిలించిన కొత్త పేరు. ఇది తప్ప మరో మార్పు లేదు. SGXలోని అన్ని ఓపెన్ పొజిషన్‌లు నేటి నుంచి అమలులోకి వచ్చిన NSE IXకి మార్చారు. నిఫ్టీ ఫ్యూచర్స్ US డాలర్-డినామినేటెడ్ కాంట్రాక్ట్‌లు ఇప్పుడు సింగపూర్ ఎక్స్ఛేంజ్‌కు బదులుగా GIFT సిటీ SEZలో ఉన్న NSE IXలో ట్రేడ్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA) రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద NSE IX పని చేస్తుంది.
SGX నిఫ్టీ పరిస్థితి ఏంటి?
SGX నిఫ్టీ ట్రేడింగ్‌లో సస్పెండ్ చేశారు, సింగపూర్ ఎక్స్ఛేంజ్ నుంచి డిలీట్ చేస్తారు.
Gift నిఫ్టీ టైమింగ్స్ ఏంటి?
ఒక రోజులో (24 గంటల్లో), గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 21 గంటల పాటు పని చేస్తుంది. ఆసియా, యూరోప్, US ట్రేడింగ్ అవర్స్ అన్నింటినీ కవర్ చేస్తుంది. ఇది రెండు సెషన్లుగా ఓపెన్‌లో ఉంటుంది - ఫస్ట్ సెషన్‌లో ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.40 వరకు, రెండో సెషన్‌లో సాయంత్రం 4.35 నుంచి తెల్లవారుజామున 2.45 వరకు పని చేస్తూనే ఉంటుంది.
గిఫ్ట్ నిఫ్టీని ఎలా చెక్ చేయాలి?
గిఫ్ట్ నిఫ్టీ ఫిగర్స్‌ను https://giftnifty.org/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
షిఫ్టింగ్ వల్ల ఇన్వెస్టర్లకు ఏంటి లాభం?
NSE IX ఒక SEZ (స్పెషల్ ఎకనమిక్ జోన్) నుంచి పని చేస్తుంది కాబట్టి... ఇన్వెస్టర్లకు STT, కమోడిటీ ట్రాన్జాక్షన్ టాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ మినహాయింపు, కాపిటల్ గెయిన్ టాక్స్ మినహాయింపు లభిస్తుంది.
రిటైల్ ట్రేడర్లు/ఇన్వెస్టర్లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది?
ఇది కేవలం ఒక స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి మరొక స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు మైగ్రేషన్ కాబట్టి, రిటైల్ ట్రేడర్లు/ఇన్వెస్టర్లపై ఎలాంటి పాజిటివ్/నెగెటివ్ ప్రభావం ఉండదు.
రిటైల్ ట్రేడర్లు గిఫ్టీ నిఫ్టీ కాంట్రాక్ట్స్‌లో ట్రేడ్ చేయవచ్చా?
వ్యక్తులు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయలేరు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) రూల్స్ ఇండివిడ్యువల్స్‌కు అడ్డొస్తాయి.
గిఫ్ట్ నిఫ్టీ కింద ఏ కాంట్రాక్ట్స్ అందుబాటులో ఉంటాయి?
గిఫ్ట్ నిఫ్టీ50 కాకుండా... NSE IXలో గిఫ్ట్ నిఫ్టీ బ్యాంక్, గిఫ్ట్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, గిఫ్ట్ నిఫ్టీ ఐటీ డెరివేటివ్ కాంట్రాక్స్ అందుబాటులో ఉంటాయి. క్రమంగా ఇతర ఇండెక్స్‌లను కూడా లాంచ్ చేసే ప్లాన్స్‌లో ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' HDFC Bank, Ultratech Cement
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

