Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్ కొంటే, మార్కెట్ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!
కంపెనీల పని తీరు మెరుగు పడకపోతే, ఈ స్థబ్దత 2023లో కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Stock market Performance: &P BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ50 రికార్డు స్థాయి లాభాలతో ఆల్ టైమ్ హైస్‌లో ట్రేడవుతున్నాయి. ఈ రెండు ప్యాక్స్‌లోని స్టాక్స్ టాప్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అయినా... ఈ రెండు ఇండెక్స్‌ల్లో ఉన్న మరికొన్ని నేమ్స్ మాత్రం వాటి ఆల్ టైమ్ స్థాయులకు చాలా దూరంగా, దిగువనే ఉన్నాయి.
మాంద్యం భయాలు, ఇటీవలి బుల్ రన్‌లో వెనుకబడడం వల్ల కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కౌంటర్ల మీద ఇన్వెస్టర్లు కన్నెర్ర జేశారు. దీంతో, అవి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి.
నష్ట జాతక స్టాక్స్
విప్రో (Wipro) షేర్లు 2022 జనవరి 03న రూ. 726.7 దగ్గర 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా.., టెక్ మహీంద్రా (Tech Mahindra) షేర్లు గత ఏడాది డిసెంబర్ 30న రూ. 1,837.8 వద్ద గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లు వాటి సంబంధిత 52 వారాల గరిష్ఠ స్థాయికి వరుసగా 43.1 శాతం, 40 శాతం దూరంలో ఉన్నాయి.
టాటా స్టీల్ (గరిష్ట స్థాయి రూ. 138.6 నుంచి 20% దిగువన), HCL టెక్నాలజీస్(గరిష్ట స్థాయి రూ. 1359 నుంచి 16.4% దిగువన), బజాజ్ ఫైనాన్స్(గరిష్ట స్థాయి రూ. 8043.5 నుంచి 16% దిగువన), ఇన్ఫోసిస్ (గరిష్ట స్థాయి రూ. 1953.7 నుంచి 15.2% దిగువన), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - TCS (గరిష్ట స్థాయి రూ. 4045.5 నుంచి 14.1% దిగువన), బజాజ్ ఫిన్‌సర్వ్ (గరిష్ట స్థాయి రూ. 1861.6 నుంచి 12% దిగువన), ఏషియన్ పెయింట్స్ (గరిష్ట స్థాయి రూ. 3590 నుంచి 11.4% దిగువన), అల్ట్రాటెక్ సిమెంట్ (గరిష్ట స్థాయి రూ. 248.3 నుంచి 10.6% దిగువన) కూడా BSE సెన్సెక్స్ ప్యాక్‌లో వెనుకబడిన స్టాక్స్.
ఫండమెంటల్ లెవెల్‌లో ఈ కంపెనీల పనితీరు ఎలా ఉంటుందన్న అంశం మీద ఈ స్టాక్స్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కంపెనీల పని తీరు మెరుగు పడకపోతే, ఈ స్థబ్దత 2023లో కొనసాగుతుందని సూచిస్తున్నారు. ఓవరాల్ మార్కెట్ హై రేంజ్‌కు పెరుగుతోంది కదాని ముందు, వెనుక ఆలోచించకుండా స్టాక్స్ కొంటే నష్టపోతారు జాగ్రత్త అంటూ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు.
ఔట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్
S&P BSE సెన్సెక్స్ ప్యాక్ నుంచి ICICI బ్యాంక్, లార్సెన్ & టూబ్రో (L&T), భారతి ఎయిర్‌టెల్, ITC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సన్ ఫార్మా, మహీంద్ర & మహీంద్ర (M&M) టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఇవి కొత్త ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేశాయి.
2023 కోసం ఏయే రంగాలు బెటర్?
ఇండియన్ మార్కెట్ల పరుగు మీద విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు. 2023లో ప్రపంచ పోటీ మార్కెట్లను ఇండియన్ మార్కెట్లు అధిగమిస్తాయని ఆశిస్తున్నారు. వినియోగ వస్తువులు, పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతికత రంగాల మీద మోర్గాన్ స్టాన్లీలో బుల్లిష్‌గా ఉంది. మిగిలిన అన్ని రంగాలకు అండర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చింది.
రాబోయే సంవత్సరాల్లో బలమైన ఆర్థిక వృద్ధికి అవకాశం ఉన్నందున; ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్‌తో పాటు మాన్యుఫాక్చరింగ్, సిమెంట్, రియల్ ఎస్టేట్, ఆటో & అనుబంధ రంగాల మీద జూలియర్ బేర్ విశ్లేషకులు బెట్స్ వేస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.