అన్వేషించండి

Share Market Opening Today: ఓపెనింగ్‌ గెయిన్స్‌ గల్లంతు - కీలక స్థాయుల దగ్గర మార్కెట్ల తడబాటు

ఓపెనింగ్‌ టైమ్‌ ఉత్సాహాన్ని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు కంటిన్యూ చేయలేకపోయాయి.

Stock Market News Today in Telugu: సోమవారం నాడు తారాజువ్వల్లా దూసుకెళ్లిన ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ సూచీలు, యూఎస్‌ మార్కెట్ల నుంచి అందిన గ్రీన్‌ సిగల్స్‌తో ఈ రోజు (మంగళవారం, 30 జనవరి 2024) పాజిజివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72000 పైన ఓపెన్‌ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21800 మార్క్‌ను దాటింది. ఐటీ షేర్లు, బ్యాంక్ షేర్లు పెరగడంతో స్టాక్ మార్కెట్‌కు గట్టి మద్దతు లభించింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ పటిష్టంగా కదులుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. అడ్వాన్స్‌డ్‌ షేర్ల సంఖ్య 1400 దాటింది, డిక్లైన్‌ షేర్ల సంఖ్య దాదాపు 200గా ఉంది. 

అయితే, ఓపెనింగ్‌ టైమ్‌ ఉత్సాహాన్ని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు కంటిన్యూ చేయలేకపోయాయి. కీలక స్థాయులను (72000 & 21800) నిలబెట్టుకోలేక రెడ్‌ జోన్‌లోకి జారిపోయాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (సోమవారం) 71,942 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 58.63 పాయింట్లు పెరిగి 72,000.20 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 21,738 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 38.15 పాయింట్లు లేదా 0.18 శాతం పెరుగుదలతో 21,775.75 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

బ్రాడర్‌ మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.6 శాతం & 0.8 శాతం వరకు పెరిగాయి.

సెన్సెక్స్ షేర్లు
సెన్సెక్స్30 ప్యాక్‌లో.. ఓపెనింగ్‌ టైమ్‌లో 22 స్టాక్స్‌ లాభాల్లో ఉండగ, 8 స్టాక్స్ క్షీణతను చూస్తున్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో.. విప్రో 1.34 శాతం, టాటా మోటార్స్ 1.16 శాతం, ఎయిర్‌టెల్ 1.11 శాతం, ఇన్ఫోసిస్ 1.07 శాతం, టెక్ మహీంద్ర 1.04 శాతం, టీసీఎస్‌ 0.92 శాతం పెరుగుదల చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో ఐటీ స్టాక్స్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

నిఫ్టీ షేర్లు
నిఫ్టీ50 ప్యాక్‌లో... ఓపెనింగ్‌ టైమ్‌లో 39 స్టాక్స్‌ బుల్లిష్ సైన్‌లో, 11 స్టాక్స్‌ బేరిష్‌ సైన్‌లో కనిపించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. డా. రెడ్డీస్ 1.63 శాతం, టాటా మోటార్స్ 1.39 శాతం, హిందాల్కో 1.36 శాతం, విప్రో 1.30 శాతం, టెక్ మహీంద్ర 1.05 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 5 శాతం క్షీణించింది. బజాన్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కూడా టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో నిలిచాయి.

ఈ రోజు ఉదయం 09.45 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 51.48 పాయింట్లు లేదా 0.07% తగ్గి 71,890.09 దగ్గర; NSE నిఫ్టీ 3.90 పాయింట్లు లేదా 0.01% పెరిగి 21,741.50 వద్ద ట్రేడవుతున్నాయి. 

BLS ఇ-సర్వీసెస్: రూ.311 కోట్ల IPO సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు ప్రారంభమైంది, ఫిబ్రవరి 01న ముగుస్తుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ.129-135 రేంజ్‌లో 2.30 కోట్ల ఫ్రెష్‌ ఈక్విటీ షేర్ల జారీ చేస్తోంది.

గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ఉదయం కోస్పి 0.8 శాతం ర్యాలీ చేసింది. జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. US ఫెడ్‌ పాలసీ సమావేశానికి ఒక రోజు ముందు, సోమవారం, అమెరికన్‌ S&P 500, డౌ జోన్స్ రికార్డు గరిష్ట స్థాయిలలో ముగిశాయి. S&P 500 0.8 శాతం ఎగబాకితే, డౌ జోన్స్ 0.6 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1 శాతానికి పైగా పెరిగింది.

గత అంచనాల కంటే తక్కువ రుణం తీసుకుంటామని US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చెప్పడంతో, బెంచ్‌మార్క్ 10-ఇయర్స్‌ US ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌ 8.6 బేసిస్ పాయింట్లు తగ్గి 4.074 శాతానికి దిగి వచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget