Share Market Opening Today: చివరి రోజు షాక్ ఇచ్చిన మార్కెట్లు - తగ్గిన OMCలు, ఐటీ - పెరిగిన ఆటో షేర్లు
కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్ & డీజిల్ రేట్లను తగ్గించవచ్చన్న రిపోర్ట్స్‌తో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు - IOC, BPCL, HPCL షేర్లు 3% వరకు పడిపోయాయి.
Stock Market News Today in Telugu: 2023 క్యాలెండర్ సంవత్సరంలో ఈ రోజు (శుక్రవారం, 29 డిసెంబర్ 2023) చివరి ట్రేడింగ్ డే. లాస్ట్ డే నాడు స్టాక్ మార్కెట్‌లో లోయర్ సైడ్‌లో ఓపెన్ అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రెడ్ మార్కుతో ప్రారంభమయ్యాయి. F&O జనవరి మంత్లీ సిరీస్ ఈ రోజే ప్రారంభమైంది, అది కూడా నష్టాలతో స్టార్ట్ అయింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (గురువారం) 72,410 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 58.79 పాయింట్ల పతనంతో 72,351 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గత సెషన్‌లో 21,779 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 41.05 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణతతో 21,737 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, HUL, సన్ ఫార్మా, ITC షేర్లు సూచీలను పైకి నెట్టడానికి ప్రయత్నిస్తుంటే; BPCL, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ONGC, టైటన్ కంపెనీ, పవర్ గ్రిడ్, SBI షేర్లు కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నాయి.
బ్రాడర్ మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా 0.18 శాతం & 0.30 శాతం చొప్పున పెరిగాయి.
రంగాల వారీగా చూస్తే.... నిఫ్టీ ఆటో, నిఫ్టీ FMCG మినహా మిగిలిన అన్ని సెక్టార్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 0.55 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ 0.4 శాతం తగ్గింది.
సెన్సెక్స్ షేర్ల చిత్రం
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో... 9 స్టాక్స్ మాత్రమే అప్ సైడ్‌లో ఉన్నాయి, మిగిలిన 21 స్టాక్స్ డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో టాటా మోటార్స్ ముందుంది. మారుతి సుజుకి 0.63 శాతం పెరిగింది. బజాజ్ ఫిన్‌సర్వ్ 0.59 శాతం, సన్ ఫార్మా 0.55 శాతం, HUL 0.51 శాతం చొప్పున పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్ & డీజిల్ రేట్లను తగ్గించవచ్చన్న రిపోర్ట్స్‌తో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు - IOC, BPCL, HPCL షేర్లు 3% వరకు పడిపోయాయి.
2024 జనవరి 1 నుంచి విలీనం అమలులోకి వస్తుండడంతో... TCPL, టాటా కాఫీ 3% జూమ్ అయ్యాయి.
రూ.120 కోట్ల ఆర్డర్‌ను గెలుచుకున్న రైల్‌టెల్ 5% పెరిగింది.
RBL బ్యాంక్‌లో 10% వాటాను కొనుగోలు చేయడానికి ICICI ప్రుడెన్షియల్ AMCకి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆమోదం తెలిపడంతో, RBL బ్యాంక్ షేర్లు 4% జంప్ చేశాయి.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 309.09 పాయింట్లు లేదా 0.43% తగ్గి 72,101.30 దగ్గర; NSE నిఫ్టీ 90.95 పాయింట్లు లేదా 0.42% తగ్గి 21,687.75 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
2023 క్యాలెండర్ సంవత్సరంలో చివరిసారి ట్రేడింగ్ రోజున అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియన్ & జపాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు తలో 0.3 శాతం చొప్పున తగ్గాయి. దక్షిణ కొరియా & చైనా మార్కెట్లు 1.6 శాతం వరకు పెరిగాయి. గురువారం, అమెరికన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా క్లోజ్ అయ్యాయి. S&P 500 0.04 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.14 శాతం పెరిగాయి. నాస్డాక్ కాంపోజిట్ 0.03 శాతం తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పెట్రోల్, డీజిల్ రేట్లకు అడ్డకోత - లీటర్‌కు రూ.10 తగ్గింపు!