అన్వేషించండి

Share Market Opening Today: ప్రారంభ లాభాలపై పట్టు కోల్పోయిన మార్కెట్లు - చేతులెత్తేసిన సెన్సెక్స్, నిఫ్టీ

బ్రాడర్‌ మార్కెట్‌లో మిడ్‌ & స్మాల్‌ క్యాప్స్‌ జోరు కంటిన్యూ అవుతోంది. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరగ్గా, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం లాభపడింది.

Stock Market News Today in Telugu: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 19 డిసెంబర్‌ 2023) పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే 1 శాతం పైగా పెరిగాయి, మార్కెట్‌ను కిక్‌ స్టార్ట్‌ చేశాయి. అయితే, ఓపెనింగ్‌ గెయిన్స్‌ నిమిషాల్లోనే ఆవిరయ్యాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ లేకపోవడంతో, ఓపెనింగ్‌ సెషన్‌లో మన మార్కెట్‌లో అనిశ్చితి కనిపించింది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (సోమవారం) 71,315 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 164.19 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 71,479 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. అయితే, వెంటనే ఎరుపు రంగులోకి జారిపోయింది. గత సెషన్‌లో 21,419 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 59 పాయింట్లు లేదా 0.28 శాతం పెరుగుదలతో 21,477 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. అక్కడి నుంచి కిందకు జారుతూ వచ్చి 21,400 స్థాయి దగ్గర కాసేపు పోరాడినా, ఆ స్థాయిలోనూ నిలదొక్కుకోలేదు.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో... స్టాక్‌ స్ల్పిట్‌కు 2024 జనవరి 05ను రికార్డ్‌ డేట్‌ ప్రకటించిన నెస్లే ఇండియా 1.5 శాతం లాభపడింది. ఇండెక్స్ హెవీవెయిట్స్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు, TCS, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, మహీంద్ర & మహీంద్ర, ఏషియన్ పెయింట్స్ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో కనిపించాయి.

వేదాంత, సైమెన్స్ ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉన్నాయి. వేదాంత, ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్‌కు ప్రకటించింది. దీంతో, మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో ఈ స్టాక్‌ 2 శాతానికి పైగా లాభపడింది. సైమెన్స్‌, తన ఇంధన వ్యాపారాన్ని విడదీసి, ప్రత్యేక కంపెనీగా మార్చడానికి చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిమెన్స్ షేర్లు దాదాపు ఒక శాతం పెరిగాయి.

బ్రాడర్‌ మార్కెట్‌లో మిడ్‌ & స్మాల్‌ క్యాప్స్‌ జోరు కంటిన్యూ అవుతోంది. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరగ్గా, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం లాభపడింది.

ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 147.46 పాయింట్లు లేదా 0.21% తగ్గి 71,167.63 దగ్గర; NSE నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.20% నష్టంతో 21,375.25 వద్ద ట్రేడవుతున్నాయి.

బలంగా ఉన్న భారతదేశ ఆర్థిక డేటా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ ఆదాయాలు, పెరిగిన FII ఇన్‌ఫ్లోస్‌ కారణంగా ఓవరాల్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. అయితే, ఇటీవలి బలమైన ర్యాలీని దృష్టిలో పెట్టుకుని, షార్ట్‌టైమ్‌లో కొంత అస్థిరత కనిపించొచ్చని చెబుతోంది. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
2024లో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశావాదాన్ని యూఎస్‌ మార్కెట్లు సోమవారం సెషన్‌లోనూ కొనసాగించాయి, లాభాలు అందుకుని క్లోజ్‌ అయ్యాయి. S&P 500, నాస్‌డాక్ 0.5 శాతం చొప్పున లాభపడగా, డౌ జోన్స్ పెద్దగా మారలేదు. 2023లో, బ్యాంక్ ఆఫ్ జపాన్ తుది వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో, ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో ఆసియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్‌, హాంగ్ సెంగ్, కోస్పి 0.06-1 శాతం వరకు క్షీణించాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP DeshamRaksha Khadse Daughter | తన కుమార్తెను వేధించిన పోకిరీలపై కేంద్రమంత్రి పోలీస్ కంప్లైంట్ | ABP DesamSpeaker suggests massage chairs for MLAs in Assembly | MLAలకు సభ తర్వాత విశ్రాంతి కావాలి | ABP DeshamPM Modi Lion Safari | గిర్ అభయారణ్యంలో సఫారీ కి వెళ్లిన ప్రధాని మోదీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Viral News: ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
Embed widget