అన్వేషించండి

Share Market Today: హై రేంజ్‌లో స్టార్టయిన స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్‌, 25,000 వేల పైన నిఫ్టీ

Share Market Open Today: స్టాక్ మార్కెట్ ఈ రోజు ధనాధన్‌ ప్రారంభాన్ని ఇచ్చింది. BSE సెన్సెక్స్ 400 పాయింట్ల గెయిన్‌తో అద్భుతమైన గ్యాప్‌-అప్‌ అయింది. NSE నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటింది.

Stock Market News Updates Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (గురువారం, 12 సెప్టెంబర్‌ 2024)  ట్రేడింగ్ జోరుగా ప్రారంభమైంది. గ్లోబల్ సిగ్నల్స్ బలంగా ఉన్నాయి. అమెరికన్ మార్కెట్ల నుంచి వీచిన సానుకూల పవనాల ఆధారంగా, భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా గ్రాండ్‌గా ఓపెన్ అయింది. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు పచ్చగా ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ మెటల్, PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్‌ హుషారుగా ఉన్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (బుధవారం) 81,523 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 407.02 పాయింట్లు లేదా 0.50 శాతం పెరుగుదలతో 81,930 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 24,918 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 141.20 పాయింట్లు లేదా 0.57 శాతం భారీ పెరుగుదలతో 25,059 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

ట్రేడ్‌ ప్రారంభంలో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 23 స్టాక్స్ బలాన్ని ప్రదర్శించగా, కేవలం 7 స్టాక్స్ మాత్రమే బలహీనంగా కొనసాగుతున్నాయి. నిఫ్టీ50 ప్యాక్‌లోని 43 షేర్లు లాభపడగా, 7 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే పరిణామాలు
ఈ రోజు, భారత స్టాక్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (EV) సంబంధిత షేర్లలో ర్యాలీని చూసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, బుధవారం, ఎలక్ట్రిక్ వెహికల్ కోసం 10,900 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. 

BSE మార్కెట్ క్యాపిటలైజేషన్
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (market capitalization of indian stock market) రూ. 464.11 లక్షల కోట్లకు పెరిగింది. నిన్న (బుధవారం) రూ. 463.49 లక్షల కోట్ల వద్ద ముగిసింది. మంగళవారం ఇది రూ. 460.96 కోట్లుగా ఉంది.

ఈ రోజు ఉదయం 10.00 గంటలకు, BSE సెన్సెక్స్ 286.41 పాయింట్లు లేదా 0.35% పెరిగి 81,812.17 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 100.60 పాయింట్లు లేదా 0.40% వృద్ధితో 25,027 దగ్గర ట్రేడవుతోంది.

ప్రి-ఓపెనింగ్ సెషన్‌
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌లోనే, ఈ రోజు మార్కెట్‌కు గొప్ప ప్రారంభం లభిస్తుందన్న సూచనలు కనిపించాయి. ఆ సెషన్‌లో, BSE సెన్సెక్స్ 312.50 పాయింట్లు లేదా 0.38 శాతం పెరుగుదలతో 81835.66 స్థాయి వద్ద కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 117.70 పాయింట్ల లాభంతో 25,036 వద్ద ట్రేడయింది.

గ్లోబల్‌ మార్కెట్లు
నిన్న, అమెరికా మార్కెట్లలో డౌ జోన్స్‌లో 0.31 శాతం పెరుగుదలతో ముగిసింది. నాస్‌డాక్ 2.13 శాతం, S&P 500 సూచీ 1.07 శాతం లాభంతో క్లోజ్‌ అయ్యాయి. S&P 500, నాస్‌డాక్‌ సూచీలు ఇంట్రాడే ట్రేడ్‌లో 1.5 శాతం నష్టాన్ని భర్తీ చేయడం విశేషం. 2022 అక్టోబర్‌ తర్వాత మొదటిసారిగా ఇలా జరిగింది. 

పెట్టుబడిదార్లు ఇప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌ వైపు చూస్తున్నారు. దీంతో యూరోపియన్ స్టాక్స్‌ నిన్న ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ రోజు, వడ్డీ రేట్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రేటు నిర్ణయాలు వెలువడతాయి.

అమెరికన్‌ షేర్లు ఇచ్చిన ఆసరాతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గురువారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 3 శాతం ఎగబాకగా, టోపిక్స్ 2.48 శాతం లాభపడింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1.2 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 2.5 శాతం పురోగమించాయి. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 ఇండెక్స్‌ 0.6 శాతం పెరిగింది. అదే సమయంలో, హాంగ్ కాంగ్‌లోని హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా పెరిగాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన చమురు రేట్లు - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Hasan Mahmud: అసలు ఎవరీ హసన్? అంత తోపా?  కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
అసలు ఎవరీ హసన్? అంత తోపా? కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget