By: ABP Desam | Updated at : 23 Mar 2023 12:10 PM (IST)
Edited By: Arunmali
నోట్ల వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్స్
Multibagger Stocks: FY23లో (2022-23) ఇప్పటివరకు, హెడ్‌లైన్ ఇండెక్స్ నిఫ్టీ దాదాపు 2% క్షీణించింది. ఇదే కాలంలో కనీసం 59 స్టాక్స్ మల్టీబ్యాగర్లుగా మారాయి, 3,230% వరకు లాభాలు తెచ్చిచ్చాయి.
FY23 అతి పెద్ద మల్టీబ్యాగర్‌లలో, పాలిస్టర్ నూలు తయారీ సంస్థ రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ (Rayon Industries) ఒకటి. ఈ పెన్నీ స్టాక్ FY22 చివరి రోజను కేవలం రూ. 2.24 వద్ద ముగిసింది. ఇప్పుడు రూ. 75 వద్ద ట్రేడవుతోంది, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,100 కోట్లకు జూమ్ అయింది.
కే&ఆర్ రైల్ ఇంజినీరింగ్ (K&R Rail Engineering) కూడా FY23లో 1,900% పైగా రాబడిని అందించింది. టాప్ మల్టీబ్యాగర్‌ల లిస్ట్‌లో రజనీష్ వెల్నెస్ (Rajnish Wellness), నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్ (Knowledge Marine & Engineering Works), హార్డ్‌విన్ ఇండియా (Hardwyn India), షిల్చార్ టెక్నాలజీస్ (Shilchar Technologies), మఫిన్ గ్రీన్ ఫైనాన్స్ (Mufin Green Finance), అక్షిత కాటన్ (Axita Cotton), ఇమేజికావరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Imagicaaworld Entertainment), అపార్ ఇండస్ట్రీస్ (Apar Industries) ఉన్నాయి.
FY23లో టాప్ మల్టీబ్యాగర్స్:
స్టాక్ పేరు: FY23లో లాభం (%)
రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ 3,230
కే&ఆర్ రైల్ ఇంజినీరింగ్ 1,950
రజనీష్ వెల్నెస్ 513
నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్ 478
హార్డ్‌విన్ ఇండియా 361
షిల్చార్ టెక్నాలజీస్ 309
మఫిన్ గ్రీన్ ఫైనాన్స్ 270
అక్షిత కాటన్ 269
ఇమేజికావరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ 254
అపార్ ఇండస్ట్రీస్ 249
ప్రవేగ్ 215
పారామౌంట్ కమ్యూనికేషన్స్ 205
జెన్సోల్ ఇంజనీరింగ్ 205
మోల్డ్-టెక్ టెక్నాలజీస్ 201
WPIL 194
టార్గెట్ - స్టాప్ లాస్
రాజ్ రేయాన్ విషయానికొస్తే, ఈ స్టాక్‌ను రూ. 58 స్థాయికి సమీపంలో కొనుగోలు చేయడం మంచిదని GCL Broking సంస్థ CEO రవి సింఘాల్ సూచించారు. రూ. 99 టార్గెట్ ప్రైస్, రూ. 47 వద్ద స్టాప్ లాస్ ఉంచాలని సూచించారు.
సాంకేతిక ప్రాతిపదికన, రజనీష్ వెల్నెస్ కూడా మంచి స్థానంలో ఉందని సింఘాల్ వెల్లడించారు. ఈ స్టాక్‌ను "రూ. 25 - 37 టార్గెట్ ధర కోసం కొనవచ్చు. రూ. 12 స్టాప్ లాస్‌ను ఖచ్చితంగా ఉంచండి" అని సిఫార్సు చేశారు.
నాలెడ్జ్ మెరైన్ కౌంటర్‌కు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ రూ. 1,500, స్టాప్ లాస్ రూ. 800.
లిస్ట్‌లో ఉన్న ఇతర స్టాక్స్‌లో, FY23లో, డిఫెన్స్ PSU స్టాక్ మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ దాదాపు 180% ర్యాలీ చేసింది.
BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్, ది కర్ణాటక బ్యాంక్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మారథాన్ నెక్స్ట్‌జెన్ రియల్టీ, అపోలో మైక్రో సిస్టమ్స్, టిటాగర్ వ్యాగన్స్, రమ స్టీల్ ట్యూబ్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఛాయిస్ ఇంటర్నేషనల్, జూపిటర్ వ్యాగన్స్, వరుణ్ బెవరేజెస్, కరూర్ వైశ్యా బ్యాంక్, UCO బ్యాంక్, అతుల్ ఆటో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు పైగా పెంచాయి.
నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ FMCG, నిఫ్టీ CPSE, నిఫ్టీ ఆటో టాప్ పెర్ఫార్మింగ్ చేయగా... నిఫ్టీ IT, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ మెటల్ లూజర్స్‌గా మిగిలాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Price Today 03 June 2023: పసిడి ఊగిసలాట - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
UPI: ఫోన్ తియ్-పే చెయ్, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్ - ఆటో, రియాల్టీ, మెటల్స్ బూమ్!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు