News
News
X

Stock Market News: బడ్జెట్‌ బూస్ట్‌ దొరికిన 30 స్టాక్స్‌, మార్కెట్‌ కళ్లన్నీ ఇప్పుడు వీటి మీదే!

ఫైనాన్షియల్స్‌, డిస్క్రిషనరీ కన్‌జంప్షన్‌, ఇండస్ట్రియల్స్‌ సెక్టార్లకు ఈ బ్రోకరేజ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది.

FOLLOW US: 
Share:

Stock Market News: స్టాక్‌ మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర బడ్జెట్‌ వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మూలధన వ్యయం, వినియోగాన్ని పెంచడం ద్వారా వచ్చే ఆర్థిక వృద్ధి మీద తన బడ్జెట్‌లో ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో, మూడు రంగాలు - మూలధన వ్యయం (capex), వినియోగం (consumption), రుణ వృద్ధి (credit growth) మీద మార్కెట్‌ పెట్టుబడిదార్లు దృష్టి పెట్టారు. ఈ రంగాల్లోని మంచి స్టాక్స్‌ను ఏరుకుంటున్నారు.

ప్రపంచ అనిశ్చితుల మధ్య, మూలధన వ్యయాలను పెంచడం, ఆర్థిక ఏకీకరణ, మూలధన లాభాల పన్నును పెంచకం పోవడం వంటివి స్టాక్స్‌కు మంచి పరిణామంగా మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) చెప్పింది. కేంద్ర బడ్జెట్ తర్వాత... ఫైనాన్షియల్స్‌, డిస్క్రిషనరీ కన్‌జంప్షన్‌, ఇండస్ట్రియల్స్‌ సెక్టార్లకు ఈ బ్రోకరేజ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది.

ITC, L&T, కాపెక్స్ కంపెనీలు, పైప్ కంపెనీలు బడ్జెట్ నుంచి లాభపడతాయని గ్లోబల్ బ్రోకరేజ్ జెఫరీస్ (Jefferies) చెప్పింది. బీమా, చమురు మార్కెటింగ్ కంపెనీలకు బడ్జెట్‌ ప్రతికూలంగా ఉంటుందని పేర్కొంది.

బడ్జెట్‌ తర్వాత, వృద్ధి ఉంటుందని ఆశిస్తూ ICICI సెక్యూరిటీస్ ఎంచుకున్న స్టాక్స్‌ ఇవి:

1) పెట్టుబడి & తయారీ రంగం: L&T, భెల్‌, సిమెన్స్, ఆస్ట్రల్, గ్రీన్ ప్యానెల్, సెంచురీ ప్లై, ఫీనిక్స్ మిల్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, అల్ట్రాటెక్, JSPL, జిందాల్ స్టెయిన్‌లెస్, BEL, సోలార్, TCI ఎక్స్‌ప్రెస్, గతి, ONGC, IOCL, IGL, NHPC, కోల్ ఇండియా, భారతి ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, అశోక్ లేలాండ్, మహీంద్రా CIE, బాలకృష్ణ ఇండస్ట్రీస్, డా.రెడ్డీస్, టోరెంట్ ఫార్మా.

2) రుణ వృద్ధి: SBI, యాక్సిస్ బ్యాంక్, ఫ్యూజన్

3) వినియోగం: HUL, ITC, జ్యోతి ల్యాబ్స్, జూబిలెంట్, మెట్రో బ్రాండ్స్, ఇండిగో, టాటా మోటార్స్, TVS మోటార్స్, ఇండియామార్ట్, డెలివెరీ, హావెల్స్, క్రాంప్టన్

బ్రోకింగ్‌ కంపెనీ షేర్‌ఖాన్ కూడా... లార్జ్‌ క్యాప్స్‌ నుంచి ITC, HDFC బ్యాంక్, SBI, M&M, L&T, భారతి ఎయిర్‌టెల్‌ను ఎంపిక చేసింది. మిడ్‌క్యాప్/ స్మాల్‌క్యాప్ స్పేస్‌లో.. కమిన్స్, ట్రెంట్, ఇండియన్ హోటల్స్, ఫినోలెక్స్ కేబుల్, దాల్మియా సిమెంట్, GNA యాక్సిల్స్‌ను ఎంచుకుంది.

దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్... లార్జ్‌ క్యాప్స్‌ నుంచి L&T, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్, TCS, ITC, టైటాన్, ONGC, మారుతి సుజుకి, సన్ ఫార్మాను ఎంపిక చేసింది. మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో... సంవర్ధన మదర్‌సన్, APL అపోలో, దాల్మియా భారత్, ఏంజెల్ వన్, లెమన్ ట్రీ మీద బుల్లిష్‌గా ఉంది. ఎనర్జీ సెక్టార్‌ను ఈ బ్రోకింగ్‌ హౌస్ దూరంగా పెట్టింది. BFSI, IT, ఇండస్ట్రియల్స్, ఆటో, సిమెంట్‌ రంగాలను ఇష్టపడుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 02 Feb 2023 01:11 PM (IST) Tags: Stock Market Consumption Budget 2023 Capex Budget Stocks credit growth

సంబంధిత కథనాలు

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం