అన్వేషించండి

Holiday: స్టాక్‌ మార్కెట్‌కు ఇవాళ సెలవు, సాయంత్రం నుంచి కమొడిటీస్‌ ట్రేడింగ్‌

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ను (MCX) కూడా ఉదయం సెషన్‌లో మూసివేస్తారు. సాయంత్రం సెషన్‌లో, అంటే సాయంత్రం 5 గంటలకు ఈ విభాగంలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

Stock Market Holidays in April: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) హాలిడే క్యాలెండర్ ప్రకారం, మహావీరుడి జయంతి సందర్భంగా ఇవాళ (మంగళవారం, 04 ఏప్రిల్‌ 2023) స్టాక్ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ, డెరివేటివ్స్‌, SLB సెగ్మెంట్‌ సహా అన్ని విభాగాల్లో ఇవాళ ట్రేడింగ్ జరగదు.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ను (MCX) కూడా ఉదయం సెషన్‌లో మూసివేస్తారు. సాయంత్రం సెషన్‌లో, అంటే సాయంత్రం 5 గంటలకు ఈ విభాగంలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

మహావీరుడి జయంతి (Mahavir Jayanti, 2023‌) సెలవు కాకుండా ఈ వారంలో మరో రోజు, ఈ నెలలోనే మరో రెండు రోజులు సెలవులు (శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులు మినహా) ఉన్నాయి. ఈ వారంలో తదుపరి హాలిడే ఏప్రిల్ 7న, శుక్రవారం (గుడ్ ఫ్రైడే) నాడు వస్తుంది. ఆ రోజున... బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE), మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) కార్యకలాపాలు జరగవు. ఈ ఎక్సేంజీల్లోని అన్ని విభాగాలు ఉదయం సెషన్ మాత్రమే కాకుండా ఆ రోజంతా పని చేయవు. అంటే, ఈ వారంలో బుధవారం ‍‌(5వ తేదీ), గురువారం ‍‌(6వ తేదీ) మాత్రమే ఈక్విటీ, డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ డేస్‌ మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత 8, 9 తేదీల్లో శని, ఆదివారాలు ఉన్నాయి. మళ్లీ వచ్చే సోమవారం (10వ తేదీ) నాడు మాత్రమే ఈ విభాగాలు ట్రేడింగ్‌ కోసం ఓపెన్‌ అవుతాయి.

ఈ వారంలో కేవలం 2 రోజుల ట్రేడింగ్‌ ట్రేడింగ్‌ మాత్రమే మిగిలివుంది కాబట్టి, ఆప్షన్‌ ప్రీమియంల డికే చాలా వేగంగా ఉంటుంది. ఆప్షన్‌ ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

ఈ నెలలో మిగిలి ఉన్న మరో సెలవు అంబేద్కర్ జయంతి. వచ్చే వారంలో శుక్రవారం నాడు (2023 ఏప్రిల్‌ 14) అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆ రోజు కూడా BSE, NSE, MCXలో కార్యకలాపాలు జరగవు.

17,200 పైన ఉన్నంత వరకు బుల్స్‌దే రాజ్యం
నిన్న (సోమవారం) సెన్సెక్స్ & నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో స్థిరపడ్డాయి; అయినప్పటికీ, మార్కెట్ చాలా టైట్‌ రేంజ్‌లోనే ట్రేడ్‌ అయింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి ట్రేడింగ్‌ రోజున ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు ప్రతికూల ఆశ్చర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

కీలక మద్దతు స్థాయి 17,200 కంటే పైనే నిఫ్టీ ముగియడాన్ని బట్టి, మార్కెట్‌లో షార్ట్‌టర్మ్‌ ట్రెండ్‌ సాంకేతిక ప్రాతిపదికన సానుకూలంగానే ఉంది.

"నిఫ్టీ 17,200 కంటే పైన ఉన్నంత వరకు ఎద్దులదే పైచేయి అవుతుంది. ఆ పైన, 17,500 స్థాయి నుంచి ఇండెక్స్‌కు కీలక ప్రతిఘటన ఎదురుకావచ్చు. అక్కడ ఒత్తిడిని తట్టుకుని, 17,500 స్థాయి కంటే పైన నిలదొక్కుకుంటే, బలమైన ర్యాలీని చూసే అవకాశం ఉంది" - రూపక్ దే, LKP సెక్యూరిటీస్‌లో సీనియర్ టెక్నికల్ అనలిస్ట్

2023 మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో, మార్కెట్‌లకు 15 వార్షిక ప్రత్యేక సెలవులు వచ్చాయి. గత సంవత్సరం కంటే రెండు సెలవులు ఎక్కువగా వచ్చాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులు వీటికి అదనం.

2023 సంవత్సరంలో ఏయే రోజుల్లో స్టాక్ మార్కెట్‌కు ప్రత్యేక సెలవులు?

ఏప్రిల్ 4, 2023 - మహావీరుడి జయంతి కారణంగా సెలవు
ఏప్రిల్ 7, 2023 - గుడ్ ఫ్రైడే కారణంగా సెలవు
ఏప్రిల్ 14, 2023 - అంబేద్కర్ జయంతి కారణంగా సెలవు
మే 1, 2023 - మహారాష్ట్ర దినోత్సవం కారణంగా సెలవు
జూన్ 28, 2023 - బక్రా ఈద్ కారణంగా సెలవు
ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
సెప్టెంబర్ 19, 2023 - గణేష్ చతుర్థి కారణంగా సెలవు
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి కారణంగా సెలవు
అక్టోబర్ 24, 2023 - దసరా కారణంగా సెలవు
నవంబర్ 14, 2023 - దీపావళి కారణంగా సెలవు
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి కారణంగా సెలవు
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్ కారణంగా సెలవు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget