అన్వేషించండి

Zomato Resignation: జొమాటో నుంచి తప్పుకున్న ఆకృతి చోప్రా- షేర్‌ హోల్డర్స్‌లో పెరుగుతున్న ఆందోళన

Akrithi Chopra: జొమాటో నుంచి మరో కో ఫౌండర్ బయటకు వెళ్లారు. ఆకృతి చోప్రా జోమాటోతో ఉన్న తన 13 ఏళ్ల అనుబంధానికి సెప్టెంబర్ 27తో ముగింపు పలికారు. షేర్‌ హోల్డర్స్‌ ఆందోళనతోనే వైదొలిగినట్లు సమాచారం.

Zomato Chief People Officer Akriti Chopra has resigned: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరింగ్ ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో కో- ఫౌండర్ దూరమయ్యారు. 2011 నుంచి జొమాటోలో పని చేస్తున్న ఆ సంస్థ చీఫ్‌ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా శుక్రవారం నాడు రిజైన్ చేశారు. ఈ మేరకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో జొమాటో పేర్కొంది.

13 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికిన ఆకృతి చోప్రా:

 ఆకృతి చోప్రా 2011 నుంచి జొమాటోలో పని చేస్తున్నారు. ఆకృతి 2019 వరకు చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో సంస్థ లీగల్ అండ్ ఫైనాన్షియల్ విభాగాల్ని విస్తృతం చేయడంలో కృషి చేశారు. ఆ తర్వాత 2021లో ఆ సంస్థ ఐపీఓకి వెళ్లే సమయంలో ఆమెను కో- ఫౌండర్‌గా చేశారు. అప్పటి నుంచి ఆకృతి చోప్రా చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ కూడా అయిన ఆకృతి జొమాటోకి ముందు PwCలో మూడేళ్ల పాటు టాక్స్ అండ్‌ రెగ్యులేటరీ సర్వీసెస్‌లో ప్రాక్టీస్ కూడా చేశారు. ఆ అనుభవంతోనే జొమాటోలో లీగల్ అండ్‌ ఫైనాన్షియల్ విభాగాన్ని బాగా విస్తృతం చేశారు. రాజీనామా విషయం జోమాటో చేసిన స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌తో బయటి వాళ్లకు తెలిసింది.

శుక్రవారం నాడు జొమాటో సీఈఓకి దీపేందర్ గోయల్‌కు మెయిల్ ద్వారా తన రెసిగ్నేషన్‌ను పంపారు. ముందుగా చర్చించుకున్నట్లు సెప్టెంబర్ 27 నుంచి తన రాజీనామా మనుగడలోకి వస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. జొమాటోకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని ఈ మెయిల్‌లో ఆకృతి పేర్కొన్నారు. జొమాటో మున్ముందు మరిన్ని లక్ష్యాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను మరికొన్ని లక్ష్యాల సాధన కోసం జొమాటో నుంచి బయటకు వెళ్తున్నట్లు బీఎస్‌ఈ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో జొమాటో స్పష్టం చేసింది.

ఆకృతి చోప్రా రాజీనామా వెనుక షేర్ హోల్డర్స్‌ లో ఆందోళన:  

ఆకృతి చోప్రా రాజీనామా వెనుక వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లింకిట్‌ ను 2022లో జొమాటో అక్వైర్ చేసింది. అయితే ఆ సంస్థ ఫౌండర్ అల్బిందర్‌ దిండ్సా ఆకృతి చోప్రా భర్త. ఈ అక్వైర్ ఐడియా వెనుక కన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయని షేర్ హోల్డర్స్ కొందరు భావిస్తున్నారు. ఇంకా పరిపాలనా పరమైన ఇష్యూస్‌లో కూడా షేర్ హోల్డర్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకృతి చోప్రా జొమాటోను వదిలేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే అంకిత్ చోప్రా జొమాటోను వదిలేయడంతో ఆ సంస్థ నుంచి బయటకు వెళ్లిన కో- ఫౌండర్ల సంఖ్య ఐదుకు చేరింది.

ఈ ఏడాది ( 2024 ) జనవరిలో జొమాటో కో ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పటిదార్ జొమాటోతో ఉన్న పదేళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. అంతకు ముందు నవంబర్ 2022లో మరో కో- ఫౌండర్ మోహిత్‌ గుప్త కూడా సంస్థను వదిలేశాడు. గుప్తను 2020లో ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ నుంచి కో ఫౌండర్‌గా ప్రమోట్ చేశారు. వీరితో పాటు పంకజ్‌ చడ్డా, గౌరవ్ గుప్త కూడా సంస్థను వదిలి వెళ్లారు. మరి కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా గత కొద్ది సంవత్సరాల కాలంలో జొమాటోను వదిలి వెళ్లిన వారిలో ఉన్నారు. అటు.. పది వేల మంది మహిళలకు జొమాటో ద్వారా అన్‌ స్కిల్డ్‌ రంగాల్లో పని చేసేలా నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇద్దామని నిర్ణయం తీసుకున్న రోజే ఆ సంస్థ కో- ఫౌండర్‌గా ఉన్న మహిళ ఆకృతి చోప్రా రిజైన్ చేశారు.

Also Read: Success Story: సిప్లా చరిత్రను మార్చిన ఒకే ఒక్కడు - ఇలాంటోడు కంపెనీకి ఒకడున్నా చాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget