Share market Today live: జోరుగా హుషారుగా..! ఐటీ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ దూకుడు
భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నాయి. వరుసగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 320, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 110 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నాయి. వరుసగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నాటి జోరునే గురువారమూ ప్రదర్శిస్తున్నాయి. రెండో క్వార్టర్లో ఐటీ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేయడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 320, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 110 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి
క్రితంరోజు 60,737 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం 300 పాయింట్ల లాభంతో మొదలైంది. ప్రస్తుతం 338 పాయింట్ల లాభంతో 61,059 వద్ద కొనసాగుతోంది. బుధవారం 18,161 వద్ద ముగిసిన నిఫ్టీకి 18,200 వద్ద మద్దతు దొరికింది. గురువారం ఉదయం 18,272 మొదలైన సూచీ ప్రస్తుతం 115 పాయింట్ల లాభంతో 18,277 వద్ద కదలాడుతోంది.
Also Read: మనదేశంలో బీఎండబ్ల్యూ మొదటి స్కూటర్ వచ్చేసింది.. షాకిచ్చే ధర.. ఏకంగా కారే కొనచ్చు!
బీఎస్‌ఈ ఐటీ సూచీ లాభాల బాట పట్టింది. 1.2 శాతం పెరిగి 35,217 వద్ద కొనసాగుతోంది. 35,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. రియాల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. గురువారం ఇన్ఫీ షేరు రూ.1784 వద్ద గరిష్ఠాన్ని తాకింది. విప్రో రూ.723 వద్ద సరికొత్త రికార్డు నమోదు చేసింది.
Also Read: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... నిలకడగా గోల్డ్, సిల్వర్ ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా
టెక్ మహీంద్రా లాభపడగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. మైండ్‌ట్రీ ఆరు శాతం ఎగిసింది. లార్సెన్ అండ్ టర్బో, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్ నష్టాల్లో ఉన్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
BSE commodity price update 13th October, 2021#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/IAl5KqI9Cy
— BSE India (@BSEIndia) October 14, 2021
BSE commodity price update 13th October, 2021#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/IAl5KqI9Cy
— BSE India (@BSEIndia) October 14, 2021
Sensex opens at 61008 with a gain of 271 points pic.twitter.com/DPOKfOAyLM
— BSE India (@BSEIndia) October 14, 2021