IT Sector Salaries: ఐటీ సెక్టార్‌లో అత్యధిక జీతం ఈయనదే, మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా లేరు
లాంటి గడ్డు పరిస్థితుల్లో బయటకు వచ్చిన సమాచారం అటు ఐటీ ఇండస్ట్రీని, ఇటు కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
Salaries of IT Sector CEOs: ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లో మందగమనం (Slowdown in IT sector) నడుస్తోంది, ఇండియన్ ఐటీ కంపెనీలకు వచ్చే పెద్ద ప్రాజెక్టుల సంఖ్య తగ్గింది. వచ్చే ఏడాది కూడా ఐటీ రంగంలో పెద్దగా వృద్ధి ఉండదనే భయం కనిపిస్తోంది. దీనివల్ల, ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్స్ లభించకపోవచ్చు. ఐటీ సెక్టార్‌లో ప్లేస్‌మెంట్లు (Placements in IT Sector) కూడా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బయటకు వచ్చిన సమాచారం అటు ఐటీ ఇండస్ట్రీని, ఇటు కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.
CEO వార్షిక వేతనంతో కలకలం రేపిన విప్రో
అటు ఐటీ, ఇటు కార్పొరేట్ వర్గాల్లో ఇంతటి చర్చకు కారణం విప్రో (Wipro). 2023 ఆర్థిక సంవత్సరానికి, ఈ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ దాఖలు చేసింది. తన విదేశీ CEO థియరీ డెలాపోర్టేకు (Wipro CEO Thierry Delaporte Salary) దాదాపు రూ.82 కోట్ల వార్షిక వేతనం చెల్లిస్తున్నట్లు ఆ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ విషయం తెలిశాక ఐటీ సెక్టార్‌లో కలకలం రేగింది. ఏ ఐటీ కంపెనీ సీఈవోకి కూడా ఇంత జీతం లేదు.
ఐటీ సెక్టార్‌లో అత్యధిక జీతం
HCL టెక్, TCS CEOల కంటే డెలాపోర్టే వార్షిక వేతనం చాలా ఎక్కువ. భారతీయ ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తోంది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన వార్షిక వేతనం (Infosys CEO Salil Parekh Salary) రూ. 56.45 కోట్లు. మూడో స్థానంలో టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ ఉన్నారు, ఆయన ఏడాదికి (Tech Mahindra CEO CP Gurnani Salary) రూ.30 కోట్లు అందుకుంటున్నారు. నాలుగో ప్లేస్ టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్‌ది. ఆయన ఏడాది జీతభత్యాల మొత్తం (TCS CEO Rajesh Gopinathan Salary) రూ.29 కోట్లు. HCL టెక్ సీఈవో సి విజయకుమార్‌కు (HCL Tech CEO C Vijayakumar Salary) ఏటా రూ. 28.4 కోట్లు అందుతున్నాయి.
2020లో విప్రోలో చేరిన థియరీ డెలాపోర్టే
థియరీ డెలాపోర్టే సొంత దేశం ఫ్రాన్స్. దేశంలోని అతి పెద్ద టెక్ కంపెనీల్లో ఒకటి, రూ.93,400 కోట్లకు పైగా విలువైన విప్రోలో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అతని వార్షిక వేతనం రూ. 82.4 కోట్లు. 56 ఏళ్ల డెలాపోర్టేకు ప్రపంచ ఐటీ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. విప్రోలో చేరడానికి ముందు, ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీలో (Capgemini) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (COO) పని చేశారు. 2020 జులైలో విప్రో పగ్గాలు చేపట్టారు.
క్యాప్‌జెమినీతో సుదీర్ఘ అనుబంధం
డెలాపోర్టే, పారిస్ పబ్లిక్ యూనివర్శిటీ సైన్సెస్ నుంచి ఎకానమీ & ఫైనాన్స్‌లో డిగ్రీ చేశారు. 1992లో, ఆర్థర్ అండర్సన్ & కంపెనీలో ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. అలా మూడేళ్లు పని చేసిన తర్వాత, 1995లో క్యాప్‌జెమినీలో చేరారు. ఆ ఈ కంపెనీలో సుమారు 25 సంవత్సరాలు గడిపారు.
మరో ఆసక్తికర కథనం: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?