News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అంచనాలను గురువారం మధ్యాహ్న సమయంలో ప్రకటిస్తారు.

FOLLOW US: 
Share:

RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం నేటి నుంచి (6 జూన్‌ 2023) ప్రారంభం అయింది, గురువారం (జూన్ 8) వరకు జరుగుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక సమావేశం ఇది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరుగుతున్న సమీక్షలో.. రెపో రేటు (repo rate), CRR, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి (GDP) వంటి అంశాలపై చర్చిస్తారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అంచనాలను గురువారం మధ్యాహ్న సమయంలో ప్రకటిస్తారు.

ఖరీఫ్ పంటపై ఎల్‌ నినో ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఆహార పదార్థాల ధరలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రుతుపవనాల పురోగతిపై కూడా ఆర్‌బీఐ సమీక్షిస్తుంది.

రెపో రేటు పెంచుతారా, తగ్గిస్తారా?
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి దిగి రావడంతో, గత రెండు సమావేశాల్లో రెపో రేటును పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి కూడా, రెపో రేటులో సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి మార్పు చేయదని, వడ్డీ రేటు పెంపు ఉండదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 

గత ఏడాది కాలంలో, దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం (inflation) నేపథ్యంలో, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును ఆర్‌బీఐ 4.50 శాతం నుంచి 6.50 శాతానికి (250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50 శాతం) పెంచింది. ఈ చర్యల ఫలితంగా, గతంలో 7 శాతం పైగా నమోదైన ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌ నెలలో 5 శాతం లోపునకు చేరింది. ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయి అయిన 6 శాతం కంటే కింద ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం, వచ్చే నెలల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తుండడంతో రేట్లను పెంపులో ఇదే గరిష్ట స్థాయిగా చూడాలని, భవిష్యత్తులో ఈ రేటు తగ్గవచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.

ఏప్రిల్‌లో ‘వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం’ (Retail Inflation) 4.7 శాతంగా నమోదైంది, ఇది 18 నెలల కనిష్ఠం. మే నెలలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల చెప్పారు. మే నెలకు సంబంధించిన చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలను ఈ నెల 12న ప్రకటిస్తారు. 

వడ్డీ రేట్ల పెంపు ఇకపై ఉండదని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు. 

"CPI ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదలను అస్సలు ఆశించడం లేదు. వడ్డీ రేట్ల పెంపును పాజ్‌ చేయడానికి అవసరమైనంతగా ద్రవ్యోల్బణం తగింది. టోకు, చిల్లర ద్రవ్యోల్బణం రెండింటిలో తగ్గుదల నమోదైంది. కాబట్టి, వడ్డీ రేట్ల పెంపులో RBI ఇక విరామం తీసుకుంటుందని, రెపో రేటు పెరగదని నేను భావిస్తున్నాను" -  మదన్‌ సబ్నవిస్‌

ఈ ఏడాది రెపో రేటు 25-50 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని మదన్‌ సబ్నవిస్‌ అంచనా వేశారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాతే తగ్గింపు మొదలు కావచ్చని అన్నారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Published at : 06 Jun 2023 10:11 AM (IST) Tags: Shaktikanta Das RBI MPC Reserve Bank Of India RBI governor Repo Rate

ఇవి కూడా చూడండి

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి