Reliance: కింద పడినా పైచేయి రిలయన్స్‌దే - టార్గెట్ ధరలు పెంచిన బ్రోకింగ్ కంపెనీలు
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ పరిపూర్ణ ప్రదర్శనకు బ్రోకరేజ్ కంపెనీలు ఫిదా అయ్యాయి.

Reliance Industries Target Price: 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతాలు చేయకపోయినప్పటికీ (Reliance Industries Q4 FY24 Results), ఏడాది మొత్తంలో చూస్తే పదునైన ప్రగతి కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) కార్యకలాపాల ఆదాయం తొలిసారి రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని చేరింది. పన్నుకు ముందు లాభం (PBT) రూ.లక్ష కోట్లను దాటింది. భారత్‌లో ఈ ఘనతలు సాధించిన తొలి కంపెనీ ఇదే. మొత్తం ఆర్థిక సంవత్సరంలో, RIL ఎబిటా (EBITDA) రూ. 1,78,677 కోట్లుగా ఉంది. ముడి చమురు, పెట్రో రసాయనాల వ్యాపారాలు పెరగడంతో పాటు టెలికాం, రిటైల్ విభాగాల్లోనూ మంచి వ్యాపారం జరగడం దీనికి కారణం.
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ పరిపూర్ణ ప్రదర్శనకు బ్రోకరేజ్ కంపెనీలు ఫిదా అయ్యాయి, రిలయన్స్ స్టాక్‌పై చాలా బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ టార్గెట్ ధరలు
మార్చి త్రైమాసికం ఫలితాల తర్వాత, గ్లోబల్ బ్రోకింగ్ కంపెనీ జెఫరీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల టార్గెట్ ధరను రూ. 3,140 నుంచి రూ. 3,380కి పెంచింది. రిలయన్స్ జియో టారిఫ్ పెంపు కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో EBITDA 14 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది.
మరో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS కూడా RIL షేర్ల మీద సానుకూలంగా ఉంది. పెట్టుబడిదార్లు రిలయన్స్ షేర్లను రూ. 3420 లక్ష్యంతో (టార్గెట్ ధర) కొనుగోలు చేయవచ్చని సూచించింది. నుమావా కూడా రిలయన్స్ లక్ష్యిత ధరను రూ. 3,500కు పెంచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌ను కొనుగోలు చేయాలని ఈక్విరస్ సెక్యూరిటీస్ కూడా ఇన్వెస్టర్లకు సూచించింది. ఈ స్టాక్ ప్రస్తుత స్థాయి నుంచి మరో 10 శాతం పెరుగుదలను చూపుతోందని, రూ. 3,220 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ తెలిపింది. చమురు టు కెమికల్స్ (O2C) వ్యాపారంలో కంపెనీ అద్భుతమైన అభివృద్ధిని కనబరిచినట్లు బ్రోకరేజ్ హౌస్ తన నోట్‌లో వెల్లడించింది. KG బేసిన్‌లో ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడించింది. రిలయన్స్ జియో పనితీరు స్థిరంగా ఉందని వెల్లడించిన బ్రోకింగ్ హౌస్, రిలయన్స్ రిటైల్ వృద్ధి వేగం కాస్త నెమ్మదిగా ఉందని చెప్పింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను రూ. 3,227 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కూడా ఇన్వెస్టర్లకు సూచించింది. ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం అద్భుతమైన పనితీరు వల్ల రిటైల్ బిజినెస్ బలహీనత భర్తీ అయిందని వెల్లడించింది. ఇంతకుముందు ఈ బ్రోకరేజ్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 3,005 టార్గెట్ ఇచ్చింది.
మంగళవారం (23 ఏప్రిల్ 2024) ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు BSEలో రూ. 2,918.50 దగ్గర స్థిరపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పరిమిత లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు - మిడ్, స్మాల్ క్యాప్స్‌లో జోష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

