అన్వేషించండి

Reliance: వేడెక్కుతున్న కూల్‌డ్రింక్స్‌ - కాంపా కోలా కోసం పిచ్‌ క్లియరెన్స్‌

దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా కోలాను కొత్త అవతార్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే విడుదల చేసింది.

Reliance Campa Cola: భారతదేశంలో శీతల పానీయాల (soft drinks) మార్కెట్ నెమ్మదిగా వేడెక్కుతోంది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకి.. భారత్‌లో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా కోలాను కొత్త అవతార్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే  విడుదల చేసింది. ఇప్పుడు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్‌లో గరిష్ట వాటాను కైవసం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.

రిలయన్స్‌ జియో ఫార్ములా               
విజయవంతమైన రిలయన్స్‌ జియో ఫార్ములానే శీతల పానీయాల మార్కెట్‌లోనూ అనుసరిస్తోంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ప్లాన్‌లో భాగంగా దూకుడైన ధరల విధానాన్ని అనుసరించింది. కోకా కోలా, పెప్సీ ఉత్పత్తుల ధరల్లో సగం కన్నా తక్కువ రేటుకే కంపా కోలాను అమ్ముతోంది. కూల్‌డ్రింక్స్‌కు అత్యంత కీలకమైన వేసవి సీజన్‌లో గట్టి పోటీ ఎదురు కావడంతో.. కోకా కోలా, పెప్సీ కంపెనీలు వాటి ఉత్పత్తుల రేట్లను తగ్గిస్తున్నాయి. అయితే.. రేట్లు తగ్గించినంత మాత్రాన వాటి కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

దక్షిణాది కంపెనీతో రిలయన్స్‌ చర్చలు                     
జాతీయ మీడియా కథనం ప్రకారం... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ (Reliance Consumer Products - RCPL), చెన్నైకి చెందిన కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌తో (Kali Aerated Water Works) చర్చలు జరుపుతోంది. రిలయన్స్ కాంపా కోలాను కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ ప్లాంట్లలో తయారు చేసి, మార్కెట్‌ చేయడం గురించి ఈ చర్చలు జరుగుతున్నాయి. 

గత సంవత్సరం ఆగస్టులో కాంపా కోలాను కొనుగోలు చేయడానికి ముందే, కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరిపింది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ బోవోంటో (Bovonto) తయారు చేసి, విక్రయిస్తోంది. దక్షిణ భారతదేశంలో ప్రజాదరణ పొందిన కోలా బ్రాండ్స్‌లో బోవోంటో ఒకటి, కోకా కోలా & పెప్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇది కాకుండా, నిమ్మ, ఆరెంజ్ ఫ్లేవర్ పానీయాలను కూడా కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లను కూడా విక్రయిస్తుంది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌కు ఎనిమిదికి పైగా తయారీ ప్లాంట్లు ఉన్నాయి.

రిలయన్స్‌కు భారీ ప్రయోజనం                    
రిలయన్స్‌ - కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌ మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే, కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారీ ప్లాంట్లలో కాంపా కోలా తయారై, మార్కెట్‌ను ముంచెత్తుతుంది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారీ సామర్థ్యంతో పాటు బలమైన పంపిణీ వ్యవస్థ కూడా ఒకే ఒప్పందంతో రిలయన్స్‌కు దక్కుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget