Prestige City Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద టౌన్‌షిప్! ప్రిస్టీజ్ గ్రూప్ రూ.5000 కోట్ల పెట్టుబడి!
Prestige City Hyderabad: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది! ప్రిస్టీజ్ గ్రూప్ అతిపెద్ద టౌన్‌షిప్‌ను ప్రారంభించబోతోంది.
Prestige City Hyderabad:
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది! రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామి కంపెనీ ప్రిస్టీజ్ గ్రూప్ అతిపెద్ద టౌన్‌షిప్‌ను ప్రారంభించబోతోంది. రాజేంద్రనగర్‌లో రూ.5000 కోట్లతో 5000 అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు 'ప్రిస్టీజ్ సిటీ హైదరాబాద్' పేరు పెట్టారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 1BHK, 2BHK, 3BHK, 4BHK ఇళ్లను నిర్మిస్తున్నారు.
పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)కు సమీపంలో ప్రిస్టీజ్ సిటీ హైదరాబాద్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం గమనార్హం. బెంగళూరు, ముంబయి తర్వాత కంపెనీ విజయవంతంగా ఆరంభిస్తున్న ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 'రియల్ ఎస్టేట్ రంగంలో బెంగళూరు, ముంబయి తర్వాత హైదరాబాదే మెరుగ్గా రాణిస్తోంది. అందుకే ఇక్కడ ప్రిస్టీజ్ సిటీ హైదరాబాద్‌ను నిర్మిస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రిస్టీజ్ సిటీ హైదరాబాద్ విస్తీర్ణం 64 ఎకరాలు. 13 టవర్లలో 6,647 అపార్టుమెంట్లు ఉంటాయి. ఇందుకు 9.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ల స్థలం అవసరం అవుతుంది. 119 విల్లాలకు 0.8 మిలియన్ స్క్వేర్ ఫీట్ల భూమిని వినియోగిస్తున్నారు. పది లక్షల స్క్వేర్ ఫీట్లతో అంతర్భాగంగా రిటైల్ మాల్ ఉండటం ప్రాజెక్టుకే హైలైట్ కాబోతోందట. ఇళ్ల కొనుగోలు దారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించబోతున్నట్టు చెబుతున్నారు.
Also Read: 'పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన' బెనిఫిట్స్ గురించి తెలుసా?, అతి తక్కువ ప్రీమియంతో బీమా కవరేజ్
స్థిరాస్తి వ్యాపారంలో దేశంలోని అతిపెద్ద సంస్థల్లో ప్రిస్టీజ్ గ్రూప్ ఒకటి. దాదాపుగా అన్ని పెద్ద నగరాల్లో ప్రాజెక్టులు నిర్మించింది. ఇప్పటి వరకు 12 నగరాల్లో 280 ప్రాజెక్టులు పూర్తి చేసింది. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, లీజర్, హాస్పిటాలిటీ విభాగాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రిస్టీజ్ గ్రూప్ హైదరాబాద్‌లో ఎనిమిది ప్రాజెక్టుల్లో భాగమైంది. నానక్‌రామ్ గూడా, ఖానాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట్, శంషాబాద్, రాజేంద్ర నగర్‌లో ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి తోడుగా నానక్‌రామ్ గూడాలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీరణంలో ఆఫీస్ స్పేస్‌ను పరిచయం చేయబోతోంది.