అన్వేషించండి

Real Estate: సొంతింటి కల సాకారం బహు దూరం - హైదరాబాద్‌లో నిర్మాణం ఆగిన 6 వేల ఇళ్లు

Housing Projects: ప్రాజెక్టుల్లో జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైన ఇళ్ల సంఖ్య ఇప్పుడు 5 లక్షలు దాటింది.

Housing Sales In Hyderabad: మన దేశంలో స్థిరాస్తి రంగాన్ని, ముఖ్యంగా హౌసింగ్‌ విభాగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా ఇళ్ల కొనుగోలుదార్ల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇళ్ల (ఇండిపెండెట్‌ హౌస్‌/అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌) డెలివరీల్లో ఆలస్యం పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో నిలిచిపోయిన యూనిట్ల సంఖ్య 5 లక్షలు దాటిందని తాజా నివేదికను బట్టి తెలుస్తోంది.

ప్రతి ఐదు ఇళ్లలో ఒక ఇంటి విషయంలో జాప్యం
డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ (PropEquity) నివేదిక ప్రకారం, గత 8 ఏళ్లలో, దేశంలోని 44 నగరాల్లో మొత్తం 1,981 హౌసింగ్‌ ప్రాజెక్టులు ఆగిపోయాయి. పంపిణీలో జాప్యం వల్ల నిర్మాణాలు నిలిపోయిన ఇళ్ల సంఖ్య 5 లక్షలు దాటింది. ఈ 8 ఏళ్లలో, నిర్మాణంలో ఉన్న ప్రతి ఐదు ఇళ్లలో ఒక గృహాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు, కొనుగోలుదార్లకు అందించలేదు. డెలివరీ చేసిన నాలుగు ఇళ్లను కూడా 3 నుంచి 4 ఏళ్లు ఆలస్యంగా అందించారు.

2018 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పెరుగుదల
ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్‌ ప్రకారం, ప్రాజెక్టుల్లో జాప్యం కారణంగా నిర్మాణం స్తంభించిపోతున్న ఇళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. 2018 సంవత్సరంలో 4 లక్షల 65 వేల 555 గృహాలు ఈ లెక్కలో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 5 లక్షల 8 వేల 202 యూనిట్లకు చేరుకుంది. అంటే, ఈ కాలంలో పంపిణీ చేయలేని ఇళ్ల సంఖ్య 9 శాతం పెరిగింది.

హైదరాబాద్‌లో ఆగిన ఇళ్ల సంఖ్య
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 25 హౌసింగ్‌ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఫలితంగా 6,169 యూనిట్ల (ఇండిపెండెట్‌ హౌస్‌/అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌) నిర్మాణంలో ముందుడుగు పడడం లేదు. తమ ఇంటిని ఎప్పుడు అప్పగిస్తారా అని కొనుగోలుదార్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. "ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డెవలపర్ల దగ్గర తగిన సామర్థ్యాలు లేకపోవడం, సమయానికి డబ్బు అందకపోవడం, కొనుగోలుదార్ల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో తీసుకున్న డబ్బును వేరొకచోట పెట్టుబడులుగా పెట్టడం" వంటివి నిర్మాణ జాప్యాల్లో కారణాలని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది.

టైర్-1 నగరాల్లో చాలా మంది గృహ కొనుగోలుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని 14 టైర్-1 నగరాల్లో మొత్తం 1,636 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ కారణంగా 4 లక్షల 31 వేల 946 గృహాల యూనిట్లు పంపిణీ కాలేదు. ఈ లిస్ట్‌లో... గ్రేటర్ నోయిడా 74,645 యూనిట్లతో టైర్-1 నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. 28 టైర్-2 నగరాల్లో 76,256 యూనిట్లు డెలివరీ కాలేదు. ఈ లిస్ట్‌లో.. భివాడి 13,393 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంది.

వివిధ నగరాల్లో నిలిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులు:

హైదరాబాద్  ---  నిలిచిన ప్రాజెక్టులు: 25 --- ఆగిన ఇళ్లు: 6,169

ముంబయి ---   నిలిచిన ప్రాజెక్టులు: 234  --- ఆగిన ఇళ్లు: 37,883

బెంగళూరు ---   నిలిచిన ప్రాజెక్టులు: 225  --- ఆగిన ఇళ్లు: 39,908

థానే ---   నిలిచిన ప్రాజెక్టులు: 186  --- ఆగిన ఇళ్లు: 57,520

పుణె ---   నిలిచిన ప్రాజెక్టులు: 172  --- ఆగిన ఇళ్లు: 24,129

గురుగ్రామ్ ---   నిలిచిన ప్రాజెక్టులు: 158 --- ఆగిన ఇళ్లు: 52,509

నవి ముంబయి ---   నిలిచిన ప్రాజెక్టులు: 125  --- ఆగిన ఇళ్లు: 28,466

గ్రేటర్ నోయిడా ---   నిలిచిన ప్రాజెక్టులు: 103 --- ఆగిన ఇళ్లు: 41,438

చెన్నై ---   నిలిచిన ప్రాజెక్టులు: 92  --- ఆగిన ఇళ్లు: 21,867

కోల్‌కతా ---   నిలిచిన ప్రాజెక్టులు: 82  --- ఆగిన ఇళ్లు: 24,174

ఘజియాబాద్ ---   నిలిచిన ప్రాజెక్టులు: 50 --- ఆగిన ఇళ్లు: 15,278

లఖ్‌నవూ ---   నిలిచిన ప్రాజెక్టులు: 48  --- ఆగిన ఇళ్లు: 13.024

జైపుర్‌ ---   నిలిచిన ప్రాజెక్టులు: 37  --- ఆగిన ఇళ్లు: 9,862

భోపాల్ ---   నిలిచిన ప్రాజెక్టులు: 27  --- ఆగిన ఇళ్లు: 7,500

ఫరీదాబాద్ ---   నిలిచిన ప్రాజెక్టులు: 16  --- ఆగిన ఇళ్లు: 7,060

న్యూదిల్లీ ---   నిలిచిన ప్రాజెక్టులు: 1  --- ఆగిన ఇళ్లు: 900

మరో ఆసక్తికర కథనం: యూపీఐ చెల్లింపుల్లో మహా విప్లవం - ఒకే బ్యాంక్ ఖాతా నుంచి ఐదుగురికి 'పేమెంట్‌ యాక్సెస్‌'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Embed widget