Repo Rate: బిగ్ బ్రేకింగ్ న్యూస్ - ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథం
Big Breaking News: రెపో రేటును తగ్గిస్తారని ఎదురుచూసిన వాళ్లకు ఆశాభంగం కలిగింది.
RBI MPC Meeting Decisions - December 2023: ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే, ఈసారి కూడా రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ (RBI Repo Rate) మార్చలేదు. ఈ కీలక రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది.
రెపో రేటును తథాతథంగా కొనసాగించడం వల్ల బ్యాంక్ రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు (bank rates), EMIల భారం పెరగదు/అతి స్వల్పంగా మారవచ్చు. అయితే, రెపో రేటును తగ్గిస్తారని ఎదురుచూసిన వాళ్లకు ఆశాభంగం కలిగింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) నేతృత్వంలో గత బుధవారం రోజున ప్రారంభమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈ రోజు ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను దాస్ ప్రకటించారు.
డిసెంబర్ పాలసీ భేటీలోనూ (RBI MPC Meet, December 2023) రెపో రేటును మార్చకపోవడంతో, వరుసగా ఐదోసారి కూడా పాలసీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయనట్లైంది. తదుపరి మీటింగ్ వరకు ఇదే రేటు అమల్లో ఉంటుంది.
2023 ఫిబ్రవరి నుంచి రెపో రేట్‌లో RBI ఎలాంటి మార్పు చేయలేదు. వచ్చే ఏడాది జూన్ లోపు ఇందులో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిస్ట్‌లు రిపోర్ట్ చేశారు. అంటే, 2024-25 రెండో త్రైమాసికం తర్వాతే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో మార్పును ఆశించవచ్చు.
మరికొన్ని నిమిషాల్లో మరింత సమాచారం అప్‌డేట్ అవుతుంది, ఈ పేజీని రీఫ్రెష్ చేయండి,