అన్వేషించండి

RBI MPC Meet: రెపో రేట్‌ యథాతథం, తప్పని EMIల భారం - వరుసగా 11వ సారీ 'ఆశలపై నీళ్లు'

RBI MPC December Meet: రెపో రేటు సహా కీలక రేట్లను యథతథంగా కొనసాగిస్తూ, 5:1 మెజారిటీతో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, రెపో రేటు 6.50 శాతం వద్ద ఉంది.

RBI MPC December Meeting Decisions: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), బెంచ్ మార్క్ వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) కీలకమైన రెపో రేటును (Repo Rate) 6.50 శాతం వద్దే కొనసాగించింది, ఈసారి కూడా దానిని మార్చలేదు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు, రెపో రేట్‌ సహా కీలక రేట్లలో 'యథాతథ స్థితి కొనసాగింపు'నకు ఓటేయగా, ఒక్కరు మాత్రం వాటిని మార్చాలని ఓటేశారు. దీంతో, కీలక రేట్లలో పూర్వ స్థితినే కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా 11వసారి. RBI MPC చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను మార్చింది, అప్పటి నుంచి రెపో రేటు 6.50 శాతం వద్దే కొనసాగింది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

MSF, SDF రేట్లు
కేంద్ర బ్యాంక్‌ నిర్ణయించే కీలక రేట్లలో, రెపో రేట్‌తో పాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్లు కూడా ఉంటాయి. వీటిపైనా యథాతథ స్థితిని కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్‌ 6.75 శాతంగా, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్‌ 6.25 శాతంగా ఉన్నాయి, ఇకపైనా ఇవే కొనసాగుతాయి.

"స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు & అంచనాల తర్వాత, ద్రవ్య విధాన కమిటీ, పాలసీ రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. తత్ఫలితంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25 శాతం వద్ద అలాగే ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతంగా ఉన్నాయి - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

రుణగ్రహీతలకు ఈసారీ నిరాశే.,
రెపో రేటును తగ్గిస్తారని, ఫలితంగా బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లు, EMIల భారం తగ్గుతాయని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. కానీ, వరుసగా 11వ సారి కూడా ఆర్‌బీఐ రుణగ్రహీతల ఆశలపై నీళ్లు చల్లింది.

ద్రవ్య విధానం (Monetary Policy)
సమాజంలోని ప్రతి వర్గానికి ధరల స్థిరత్వం ముఖ్యమని గవర్నర్‌ చెప్పారు. MPC సమావేశానికి అధ్యక్షత వహించిన దాస్, 'వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధానాల'పై రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టి పెట్టిందని వివరించారు. "అధిక ద్రవ్యోల్బణం ప్రజల చేతిలోని ఖర్చు చేయగల ఆదాయాన్ని తగ్గిస్తుంది, ఇది GDP వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది" అని గవర్నర్ చెప్పారు. ఆర్థిక మార్కెట్ అస్థిరత, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు, విపరీతమైన వాతావరణ మార్పులు, ప్రకృతి ప్రకోపాలు ఆర్థిక వృద్ధికి కీలకమైన నిరోధాలని స్పష్టం చేశారు.

జీడీపీ అంచనా (GDP Projection)
స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు & అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY 2024-25 లేదా FY25) దేశాభివృద్ధి అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. FY25లో GDP వృద్ధి రేటు అంచనాను 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది.

ద్రవ్యోల్బణం (Inflation)
దేశంలో ఆహార ధరల్లో పెరుగుదలను ప్రస్తావించిన సెంట్రల్ బ్యాంక్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ (retail inflation) అంచనాను 4.8 శాతానికి పెంచింది. మునుపటి MPC సమావేశంలో ఈ అంచనా 4.5 శాతంగా ఉంది.

మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనేవాళ్లకు ఊరట, తగ్గిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Advertisement

వీడియోలు

Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Kurnool Bus Accident: 18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
Cyclone Montha Impact in AP: మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Embed widget