By: ABP Desam | Updated at : 06 Feb 2023 03:36 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పీడబ్ల్యూసీ ఇండియాలో ఉద్యోగాలు
PWC India:
ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి కబురు చెప్పింది! రాబోయే ఐదేళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. భారత వృద్ధిలో కీలక భాగస్వాములం అవుతామని వెల్లడించింది. 2028 నాటికి తమ ఉద్యోగుల సంఖ్యను 80,000కు పెంచుకుంటామని వివరించింది.
పీఎడబ్ల్యూసీ అమెరికా, పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా భారత్‌లో ఒక కొత్త జాయింట్ వెంచర్‌ను నెలకొల్పుతున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సారిస్తామని తెలిపాయి. ప్రస్తుతం ఇక్కడ కంపెనీకి 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరు స్థానికంగా, అంతర్జాతీయ డెలివరీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు.
'పీఎడబ్ల్యూసీ అమెరికా, పీఎడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యం వల్ల మా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ చర్య వృద్ధికి దోహద పడుతుంది. మా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తోడ్పాటునందిస్తుంది. అలాగే మా సాంకేతికత అభివృద్ధి చెందుతుంది' అని పీడబ్ల్యూసీ యూఎస్ ఛైర్మన్, సీనియర్ పార్ట్‌నర్ టిమ్ రియాన్ అన్నారు.
స్థానిక మార్కెట్ సామర్థ్యాన్ని ఒడిసిపడతామని పీడబ్ల్యూసీ తెలిపింది. భారత్ అభివృద్ధితో భాగస్వాములు అవుతామని ప్రకటించింది. 2021లో ఆరంభించిన అంతర్జాతీయ వ్యూహాత్మక సరికొత్త సమీకరణంలో భాగంగా దీన్ని చేపడుతోంది. 'దేశ అభివృద్ధిలో మేం మా వంతు పాత్ర పోషిస్తాం. ముఖ్య సమస్యలకు పరిష్కారం అందించేందుకు క్లయింట్లతో సన్నిహితంగా పనిచేస్తాం. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే వేదికలను సృష్టిస్తాం. ఈ దిశలో మేం వేస్తున్న ఓ ముందడుగే ఈ సరికొత్త జాయింట్‌వెంచర్' అని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్‌పర్సన్ సంజీవ్ కిషన్ పేర్కొన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. 'abp దేశం' ఎవరికీ వత్తాసు పలకడం లేదు, ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదని పాఠకులు గమనించాలి. అంతేకాదు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' సిఫార్సు చేయడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!
Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్ పరుగు - దాటితే!
Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్ - సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ!
SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్
Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్