LPG Cylinder Price Cut: గుడ్‌న్యూస్, ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ తగ్గాయి.. జూన్ 1 నుంచే అమల్లోకి
LPG Price Cut : దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. వరుసగా మూడవ నెలగా వాణిజ్య LPG సిలిండర్ ధర తగ్గించారు. దాంతో హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రయోజనం కలగనుంది.

LPG cylinder Price Reduced: జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరలు దిగొచ్చాయి. పెట్రోలియం విక్రయ సంస్థలు (OMCs) గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 24 మేర తగ్గింది.
తాజా నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు లాంటి వాణిజ్య ప్రయోజనాలకు కమర్షియల్ సిలిండర్ వినియోగించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. అవి తమ రోజువారీ జీవితంలో కమర్షియల్ సిలిండర్ పై ఆధారపపడతాయి. దాంతో ధర తగ్గడం వల్ల వ్యాపారం నడపడంలో వారి ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే వీలుంటుంది. కానీ, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంత తగ్గాయి
వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా మూడవ నెలలో దిగొచ్చాయి. దీనికి ముందు, మే నెలలో రూ. 14.5 తగ్గించారు. ఏప్రిల్ నెలలో రూ. 41 మేర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు.
Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of a 19 kg commercial LPG gas cylinder has been reduced by Rs 24, effective on June 1. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder is Rs 1723.50 from June 1.
— ANI (@ANI) May 31, 2025
- హైదరాబాద్‌లో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 తగ్గడంతో రూ.1943.50కి దిగొచ్చింది






















