By: Geddam Vijaya Madhuri | Updated at : 30 May 2025 09:05 PM (IST)
బ్యాంక్ లోన్ క్లోజ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవే (Image Source : Freepik) ( Image Source : Other )
Bank Loan Closing Checklist : బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చదువు రీత్యా, ఉద్యోగం, బిజినెస్, కారు, ఇళ్లు.. ఇలా వివిధ అవసరాల కోసం చాలామంది బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటారు. దీనిని ఈఎంఐ రూపంలో కడుతూ ఉంటారు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా డబ్బు వచ్చినా.. లేదా ఈఎంఐలు పూర్తి అయినా లోన్ క్లోజ్ అవుతుంది. ఆ సయమంలో బ్యాంక్ నుంచి కొన్ని డాక్యూమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో.. వాటిని ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని సందర్భాల్లో లేక సరైన అవగాహన లేక బ్యాంక్‌లో లోన్ క్లోజ్ చేసి దానికి సంబంధించిన పత్రాలు తీసుకోవడం మరచిపోతారు. అలా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి లోన్ పూర్తి అయిన తర్వాత బ్యాంక్ నుంచి కచ్చితంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసేద్దాం.
మీరు ఏ కారణంతో.. ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకుని.. దానిని క్లోజ్ చేసేప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి. ఇది మీరు బ్యాంక్‌లో ఎలాంటి అవుట్‌స్టాండింగ్ డ్యూస్ లేకుండా.. ఎలాంటి సమస్యలు లేకుండా లోన్ని క్లోజ్ చేసినట్లు బ్యాంక్ ఇచ్చే సర్టిఫికెట్ ఇది.
మీరు తీసుకున్న లోన్ పూర్తి అయినట్లు బ్యాంక్ కన్ఫార్మ్ చేస్తూ.. మీకు ఓ లెటర్ ఇస్తుంది. దానినే Loan Closure Letter అంటారు. మీరు పూర్తిగా డబ్బులు చెల్లించి.. లోన్ క్లోజ్ చేసినట్లు దీనిలో ఉంటుంది.
మీరు లోన్ క్లోజ్ చేసేప్పుడు చివరిగా చేసే పేమెంట్ స్టేట్మెంట్ కచ్చితంగా తీసుకోవాలి. లోన్ క్లోజ్ అయితే ఈ స్టేట్మెంట్ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి.. మీరు కట్టిన పేమెంట్స్ స్టేట్మెంట్ పూర్తిగా లోన్ చెల్లించినట్లు ఉండేలా స్టేట్మెంట్ తీసుకోవాలి. దీనినే ఫైనల్ రీపేమెంట్ స్టేట్మెంట్ అంటారు.
లోన్ సమయంలో ఫ్రూవ్ కోసం, సెక్యూరిటీ కోసం మీరు బ్యాంక్‌కి ఇచ్చిన పత్రాలు, ఆస్తి ఒప్పందం పత్రాలు, మొదలైన డాక్యుమెంట్స్ అన్ని లోన్ క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి వాటిని కచ్చితంగా తిరిగి తీసుకోవాలి.
బ్యాంక్ లోన్ క్లోజ్ ముగించినప్పుడు ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని తీసుకుని లోన్ క్లోజ్ చేసుకోవాలి.
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?