Petrol Price Today: హైదరాబాద్‌లో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో అక్కడ భారీగా పెరిగిన రేట్లు..
Petrol Price Today 3rd February 2022: గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి.
Petrol Price Today: గత ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.14 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో ఇంధన ధరలు పెరిగాయి. 15 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.07 కు చేరగా.. 14 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.49 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ పై రూ.0.29 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.109.74 కాగా, డీజిల్‌పై రూ.0.27 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.05 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 43 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.51 కాగా, ఇక్కడ డీజిల్ పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.05 అయింది. డీజిల్ ధర లీటర్ రూ.95.18 కు దిగొచ్చింది.
చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరుపై 50 పైసలు పెరగడంతో పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.81 కి చేరింది. ఇక డీజిల్ ధర రూ.0.43 పైసలు పెరగగా లీటర్ ధర రూ.97.70 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సరం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Weather Updates: ఏపీలో అక్కడ వణికిస్తున్న చలి.. ఉదయం వేళలో పొగమంచుతో బీ కేర్‌ఫుల్..
Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. నిలకడగా పసిడి ధర.. స్వల్పంగా దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ