By: ABP Desam | Updated at : 26 Mar 2022 07:42 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price in Hyderabad 26th March 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు వాహనదారులకు మళ్లీ షాకిచ్చాయి. గత మూడు నెలలుగానిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇక్కడ గత మూడు రోజులుగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. 0.91 పైసలు పెరగడంతో నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 26th March 2022) రూ.110.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.24 కు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో 90 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.40 కాగా, డీజిల్‌పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.75 కు ఎగబాకింది.
వరంగల్ రూరల్ జిల్లాలో 91 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.64 కాగా, డీజిల్‌పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.97 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 44 పైసలు పెరిగి, పెట్రోల్ ధర రూ.110.64 కాగా, 43 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.96.97కు చేరింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 18 పైసలు పెరగంతో పెట్రోల్ లీటర్ ధర రూ.112.45 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.67కి దిగొచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 26th March 2022)పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.112719 కాగా, ఇక్కడ డీజిల్ పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.70 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.68 అయింది. డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.97.69గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.113.24కి పతనమైంది. డీజిల్ పై 19 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.99.14 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధర, రూ.1000 పెరిగిన వెండి ! లేటెస్ట్ రేట్లు ఇవీ
Also Read: Weather Updates: భగభగ మండుతున్న సూరీడు - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల ప్రజలు బీ కేర్‌ఫుల్ !
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
Cryptocurrency Prices Today: కొద్దిగా లాభపడ్డ బిట్‌కాయిన్! ఎథీరియమ్కు సపోర్ట్!
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Infinix Note 12 Flipkart Sale: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?