By: ABP Desam | Updated at : 03 Jul 2022 07:30 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర తగ్గి రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) కూడా నాలుగు రోజులుగా ధరలు స్థిరంగా ఉంటున్నాయి. నేడు (జులై 3) పెట్రోల్ ధర రూ.109.16 గా నిలకడగా ఉంది. డీజిల్ ధర రూ.97.35గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.10 పైసలు తగ్గి.. పెట్రోల్ ధర రూ.111.33 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) నేడు రూ.0.08 పైసలు తగ్గి రూ.99.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.09 పైసలు పెరిగి రూ.111.88 గా ఉంది. డీజిల్ ధర రూ.0.10 పైసలు తగ్గి రూ.99.62 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.34 పైసలు పెరిగి, నేడు రూ.110.82 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.32 పైసలు పెరిగి రూ.98.59గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.23 పైసలు తగ్గి రూ.112.32 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.29 పైసలు తగ్గి రూ.99.90 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. జూలై 3 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 108.48 డాలర్ల స్థాయిని చేరింది.
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Cryptocurrency Prices: దూసుకెళ్లిన బిట్‌కాయిన్! జోరుమీదున్న ఎథీరియమ్
Stock Market Weekly Review: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు! 60K దాటితే సెన్సెక్స్‌ను ఆపలేం!
NPS Balance Check: ఎన్పీఎస్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా! సింపుల్‌గా 4 మార్గాలు!!
Gold Price: బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! నెల రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్!
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?